టిక్ టాక్‌కి రీప్లేస్‌‌‌గా "Vreels".. ఇండియన్ ఇంజినీర్స్ కొత్త యాప్ !!

మారుతున్న కాలానుగుణంగా ప్రపంచం డిజిటల్ గా పరుగులు పెడుతుంది. చాటింగ్, వీడియోలు చూడటం, షాపింగ్ వంటి అనేక అవసరాల కోసం రోజుకో కొత్త యాప్‌ వస్తుంది. అలానే కంటెంట్ క్రియేషన్ కోసం రీల్స్ షేరింగ్ కోసం కూడా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అటు ఫేస్ బుక్, ఇన్ స్టా లానే కనెక్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడేలా ఒక కొత్త యాప్ వచ్చేసింది. అదే 'Vreels'. 'Vreels' అంటే Virtually Relax, Explore, Engage, Live & Share.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఇంజనీర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ఇప్పటికే 22 దేశాల్లో విడుదలైన Vreels, ప్రస్తుతం బీటా దశలో ఉంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ల నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకొని, ఈ నూతన డిజిటల్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. మరింత సమాచారం కోసం www.vreels.com సందర్శించవచ్చు.

vreels-innovative-digital-platform-for-creation-and-engagement

Vreels అనేది వినోదం, సంభాషణ, సమాజం కలగలిసిన ఒక వినూత్న డిజిటల్ వేదిక అని పేర్కొంటున్నారు. చిన్న వీడియోలు, ఫోటోలు, సృజనాత్మక కథలు వంటివి వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఇది మీకు నచ్చిన విషయాలను నేర్చుకుంటూ మరింత వ్యక్తిగత అనుభవాన్ని అందిస్తుంది.

Vreels లో 'Reels & Pix' ఫీచర్‌తో మీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలను క్షణాల్లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి పంచుకోవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్ట్‌తో క్రియేటర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. ప్రతి రీల్ ఒక అనుభవంగా.. ప్రతి పిక్ ఒక మధుర స్మృతిలా మార్చుకోవచ్చని అంటున్నారు.

అలానే 'V Map'తో మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది. 'V Capsules' అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా మీ భావోద్వేగ జ్ఞాపకాలను ఒక 'క్యాప్సూల్'లో ఉంచి, ఒక నిర్దిష్ట తేదీన తెరచుకునేలా చేయవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు లేదా ముఖ్యమైన ఘట్టాల రోజున ఆ జ్ఞాపకాలు ఓపెన్ అయ్యేలా చేయవచ్చు.

'Pix Pouches'తో డిజిటల్ నోట్‌బుక్ మెయిన్ టైన్ చేయవచ్చు. ఇష్టమైన ఫోటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా భద్రపరుచుకోవచ్చు. 'Chats & Calls' ఫీచర్‌తో స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్‌లో చాట్ చేయడానికి, లేదా వీడియో కాల్స్ చేయడానికి వేర్వేరు యాప్‌ల అవసరం లేదు. ఈ అనుభవాలన్నీ Vreelsలోనే అందుబాటులో ఉంటాయి.

మరోవైపు 'Vreels Shop/Bid' త్వరలో అందుబాటులోకి రానుంది. వెండర్లు తమ ఉత్పత్తులను అందించవచ్చు. వినియోగదారులు నమ్మకంతో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇదంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారమ్‌లో జరుగుతుందని చెబుతున్నారు.

మన డేటా భద్రత కొరకు టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు వంటివి మీ వ్యక్తిగత డేటాను కాపాడటానికి పటిష్టంగా అమలులో ఉన్నాయి. మీ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్‌ను ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ప్రతి అప్‌డేట్‌తో స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు వస్తాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+