ఇంట్లోనే ఉంటూ వాట్సాప్‌తో నెలకు లక్షల్లో సంపాదన..!
వాట్సాప్.. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్. చాటింగ్ నుంచి కాల్స్ వరకు.. ఫోటోలు, లొకేషన్, డాక్యుమెంట్ షేరింగ్ తో పాటు ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. అయితే కొందరు మాత్రం దీనిని చాటింగ్ కోసమే కాకుండా ఆదాయ వనరుగా మార్చుకొని రోజూ వేలల్లో.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా సులభంగా నెలకు లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు.
వాట్సాప్ బిజినెస్..
అయితే ఈ విధంగా వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటగా వాట్సాప్ బిజినెస్ యాప్. దీన్ని సాధారణంగానే ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ షాప్ పేరు, చిరునామా, ఫోటోను ఉంచి బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత "కెటలాగ్" ఆప్షన్‌ను ఉపయోగించి మీరు విక్రయించే ఉత్పత్తుల ఫోటోలు, ధరలు, వివరాలను అప్‌లోడ్ చేయాలి. వినియోగదారులు నేరుగా మీ కెటలాగ్‌ను చూసి ఆర్డర్లు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న వ్యాపారాలు వెబ్‌సైట్ లేకుండానే రోజుకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

అలానే వాట్సాప్ బిజినెస్ లో ఆటో రిప్లై ఫీచర్‌ను సెట్ చేయడం ద్వారా వినియోగదారులు "హాయ్" అని సందేశం పంపగానే.. మీ ఉత్పత్తుల జాబితా, ధరలు ఆటోమేటిక్‌గా వారికి చేరుతాయి. ఈ ఫీచర్ 24 గంటలూ పనిచేస్తుంది, కాబట్టి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా విక్రయాలు జరుగుతాయి. అంతే కాకుండా కెటలాగ్ ఫీచర్‌లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌ను ఉపయోగించి ఒకేసారి 256 మందికి సందేశాలు పంపవచ్చు. కొత్త ఉత్పత్తులు లేదా ఆఫర్‌ల గురించి ప్రచారం చేయవచ్చు.
ఇందులో మీరు విక్రయించే ప్రొడక్ట్ ఏదైనా కానీ.. వాటి ఫోటోలను అప్‌లోడ్ చేసి.. ప్రతి వస్తువుకు ధర, పరిమాణం, రంగు వంటి వివరాలను ఇవ్వాలి. వినియోగదారులు మీ నంబర్‌ను ఓపెన్ చేయగానే మీ పూర్తి షాప్ వారికి కనిపిస్తుంది. అలా వెంటనే నచ్చిన వస్తువు పక్కన "మెసేజ్" బటన్‌ను నొక్కడం ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఈ కెటలాగ్ ద్వారా చాలా మంది రోజుకు రూ.20 వేల నుంచి రూ.1 లక్ష వరకు సులువుగా సంపాదిస్తున్నామని చెబుతున్నారు. ఇందుకు వెబ్‌సైట్ లేదా షాప్ అద్దె వంటి ఖర్చులు మినహాయింపు కావడం బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు.
వాట్సాప్ కమ్యూనిటీ..
వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 50 గ్రూపుల వరకు చేర్చవచ్చు. స్టాక్ మార్కెట్ చిట్కాలు, ఆన్‌లైన్ కోర్సులు లేదా ఫుడ్ డెలివరీ గ్రూపులను క్రియేట్ చేసి.. జాయిన్ ఫీజు వసూలు చేయవచ్చు. అలా నెలకు రూ.199 నుంచి రూ.999 వరకు వసూలు చేయడం ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
అఫిలియేట్ మార్కెటింగ్..
పెట్టుబడి లేకుండా పెద్ద మొత్తంలో సంపాదించడానికి సులువైన మార్గం అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనే చెప్పాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల అఫిలియేట్ లింక్‌లను మీ గ్రూపుల్లో షేర్ చేసి ఎవరైనా మీ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు 5% నుండి 20% వరకు కమిషన్ లభిస్తుంది. అలా రోజుకు 20-30 మంది కొనుగోలు చేసినా నెలకు రూ.40-80 వేలు ఖచ్చితంగా సంపాదించవచ్చు.
ఇవే కాకుండా వాట్సాప్ ద్వారా ఆదాయం పొందడానికి మరిన్ని మార్గాలున్నాయి. మీకు ఏదైనా నైపుణ్యం (ఫిట్‌నెస్, వంట, విద్య) ఉంటే, వాట్సాప్‌లోనే కన్సల్టింగ్ సేవలు అందించవచ్చు. ఈబుక్స్, PDF కోర్సులను తయారు చేసి విక్రయించవచ్చు. పెద్ద కంపెనీలకు వాట్సాప్ కస్టమర్ సపోర్ట్ సేవలు అందిస్తూ జీతం కూడా సంపాదించుకోవచ్చు. మీలో కూడా ఈ విధమైన టాలెంట్ ఉంటే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోని సంపాదించడం ప్రారంభించవచ్చు.
-
7500mAh భారీ బ్యాటరీతో OnePlus 15T లాంఛ్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications