అభిషేక్ శర్మకు IPLయాజమాన్యం భారీ షాక్- అదే వద్దు, తగ్గించుకోకుంటే..ఇక..!!
IPL 2026: SRH స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను అతిక్రమించినందుకు ఈ కఠిన నిర్ణయం ప్రకటించింది. అభిషేక్ తన తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే క్రమంలో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. కేవలం జరిమానాతోనే కాకుండా, అతని క్రమశిక్షణ రికార్డులో ఒక నెగటివ్ పాయింట్‌ను కూడా చేర్చారు. దీంతో, అభిషేక్ దిగిరాక తప్పలేదు.
సర్ రైజర్స్ కీలక ఆటగాడు అభిషేక్ కు ఊహించని షాక్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. కేవలం జరిమానాతోనే కాకుండా, అతని క్రమశిక్షణ రికార్డులో ఒక నెగటివ్ పాయింట్‌ను కూడా చేర్చారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను అతిక్రమించినందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరుపై వివాదం నెలకొంది. తను ఇచ్చిన క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయం పట్ల అభిషేక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానం వీడుతున్న సమయంలో అసహనంతో అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినట్లు తేలింది. టీవీ రీప్లేలు, క్షేత్రస్థాయి అంపైర్ల నివేదిక ఆధారంగా, అతను ఆర్టికల్ 2.3ని ఉల్లంఘించినట్లు నిర్ధారించారు.

తీరు మార్చుకోవాలని హెచ్చరిక
అభిషేక్ శర్మ తన తప్పును అంగీకరించడంతో విచారణ లేకుండానే జరిమానాను ఖరారు చేశారు. 25 శాతం మ్యాచ్ ఫీజు కోత అనేది ఆర్థికంగా పెద్ద దెబ్బే అయినప్పటికీ, డీమెరిట్ పాయింట్ రావడం అనేది భవిష్యత్తులో సమస్యగా మారనుంది. ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో మరిన్ని ఇలాంటి పాయింట్లు అతని ఖాతాలో చేరితే, ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు జట్టు భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో, కీలక ఆటగాడు ఇలా వివాదంలో చిక్కుకోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అభిషేక్ శర్మ ఈ శిక్షను ఎదుర్కోక తప్పదు. అంపైర్ నిర్ణయంపై అసభ్య పదజాలంతో దూషించాడనే కారణంతో లెవల్ వన్ నేరం కింద డాషింగ్ ఓపెనర్‌పై మ్యాచ్ రిఫరీ ఈ పనిష్మెంట్ విధించారు.












Click it and Unblock the Notifications