అభిషేక్ శర్మ ఇక డగౌట్ లోనే, తేల్చేసిన గంభీర్- సంజూనే బెటర్..!!
T20 World cup: పాకిస్థాన్ పైన టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. సూపర్ 8 కు చేరింది. పాక్- అమెరికా మధ్య ఒక టీం భారత్ పాటుగా సూపర్ 8 కు వెళ్లాల్సి ఉంటుంది. కాగా, పాక్ పైన వీర విహారం చేసిన ఇషాన్ కిషన్ పైన ప్రశంసలు కురుస్తున్న సమయంలోనే స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ పైన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సరైన సమయంలో ఇలా ఎలాంటి ప్లానింగ్ లేకుండా వరుసగా డకౌట్లు అవ్వటం జీర్ణించుకోలేక పోతున్నారు. వారి అంచనాలను అందుకో లేక పోతున్న అభిషేక్ స్థానంలో సంజూ బెటరనే అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా గంభీర్ పాక్ తో మ్యాచ్ తరువాత వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కీలకంగా మారుతోంది.
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ వరుసగా డకౌట్లు అవుతున్న తీరు జట్టు మేనేజ్మెంట్ కే కాదు.. ఫ్యాన్స్ కు నచ్చటం లేదు. తాజాగా పాక్ తో మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ సల్మాన్ అఘా బౌలింగ్‌లో మొదటి ఓవర్ చివరి బంతికి షాట్‌కు యత్నించిన అభిషేక్.. మిడాన్‌లో షహీన్ ఆఫ్రిదికి తేలికైన క్యాచ్ ఇచ్చాడు.

పాకిస్థాన్‌పై మాత్రమే కాదు.. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఆడిన మొదటి మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. 12న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కడుపు నొప్పి కారణంగా అభిషేక్ ఆడలేదు. కీలక పాక్ మ్యాచ్‌లో అతడిని ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ చూసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అభిషేక్.. పాకిస్థాన్‌పై కూడా డకౌట్ అయ్యాడు.
టీం మేనేజ్మెంట్ ఆలోచన మారుతోందా
నమీబియాపై ఆడిన సంజు శాంసన్ 8 బంతుల్లోనే 22 రన్స్ చేశాడు. రెండు మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అభిషేక్ కంటే సంజూ బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ చివరి ఆరు టీ20 ఇన్నింగ్స్ స్కోర్లు వరుసగా 0(1), 68 నాటౌట్(20), 0(1), 30(16), 0(1), 0(4) ఉన్నాయి. మరోవైపు కేవలం 20 బంతుల్లో 68 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ అభిషేక్ సామర్థ్యాన్ని చాటుతోంది. ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు డకౌట్ కావడం టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన కలిగిస్తోంది.
అయితే.. గంభీర్ మాత్రం అభిషేక్ ను కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నట్లు తాజా కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక, లీగ్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ తరువాత కీలకమైన నాకౌట్ దశకు ప్రపంచ కప్ చేరుకుంటోంది. దీంతో.. అభిషేక్ డకౌట్లు ఆగి తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టు కుంటాడా.. డకౌట్ కే పరిమితం అవుతాడా అనేది అతని ఆట తీరే తేల్చాల్సి ఉంటుంది.
-
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
భగవంతుడా.. కూతురు శవంతోనే ఐదు నెలలు పాటు తండ్రి.. ఏం చేశాడంటే ?? -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications