క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్ - ఇక సమరమే..!!
టీమిండియా కొత్త ఏడాది పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా రేపు (శుక్రవారం) నుంచి సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు సిద్దమైంది. టీంలో కొత్త తరం కు ప్రాధాన్యత పెరిగింది. అభిమానులు యంగ్ ప్లేయర్స్ పైన భారీ అంచనాలతో కనిపిస్తున్నారు. దీంతో, ఈ ఏడాది టీం ఇండియా కు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. పలువురు సీనియర్ ప్లేయర్ల భవిష్యత్ పైన స్పష్టత రానుంది. ఇటు 2025 మొత్తం టీమిండియా షెడ్యూల్ పూర్తి బిజీగా ఉంది. కీలక సమరాలకు ఇదే ఏడాది వేదిక కానుంది.
2025 షెడ్యూల్ ఫిక్స్
2024 లో మిశ్రమ ఫలితాలు అందుకున్న టీం ఇండియా 2025 పైన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ కొత్త ఏడాది టీమిండియా షెడ్యూల్ ఫిక్స్ అయింది. పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే, టీమిండియా ఆడే మ్యాచ్ లు హైబ్రీడ్ విధానం లో జరగనున్నాయి. దీనికి ముందే టీమిండియా జట్టు స్వదేశంలో జనవరి 22నుంచి ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సిద్ధమైంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరగనున్న దృష్ట్యా ఇంగ్లండ్‌తోనూ మూడు వన్డేల సిరీస్‌ను భారత్ సిద్ధం చేసింది. ఆ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. అది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఉంటుంది.

కీలక సమయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓడిన టీమిండియా.. 11ఏళ్ల తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు మరోసారి చేరే ఛాన్స్ దక్కట కష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యుటిసి ఫైనల్స్‌కు ఇప్పటికే అర్హత సాధించగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు రేసులో ఉన్నాయి. రేపు (బుధవారం) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో, చివరి టెస్ట్ భారత్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయి వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయిన తరువాత ఇక
ఐపిఎల్ సీజన్ మార్చి 14నుంచి ప్రారంభం కానుంది.
వరుస మ్యాచ్ లు
ఆ తర్వాత టీమిండియా జూన్-ఆగస్ట్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు టిలు, మరో మూడు వన్డేల్లో.. అక్టోబర్ 25నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు ఫార్మాట్‌లలోనూ ఆడనుంది. ఇంగ్లాండ్ తో జరిగే టీ-2 సిరీస్ లో అయిదు మ్యాచ్ లు జనవరి 22న చెన్నై, 25న కోల్ కతా, 28న రాజ్ కోట్, 31న పూణే, ఫిబ్రవరి 2న ముంబాయిలో జరగనున్నాయి. ఇక, వన్డేలు ఫిబ్రవరి 6న నాగపూర్, 9న కటక్, 12న అహ్మదాబాద్ లో జరిగేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు.












Click it and Unblock the Notifications