IPL కు సునామీ బ్యాటర్ గుడ్ బై.. !!

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ గడువు దగ్గర పడుతోంది. డిసెంబర్ 16వ తేదీన అబుధాబి వేదికగా ఈ వేలం జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే వెలువడింది కూడా. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంఛైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఈ రిటెన్షన్ జాబితా వెలువడిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ పరిణామాల మధ్య కోల్ కత నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. వెస్టిండీస్ టీ20 స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. ఓ వీడియోను అతను పోస్ట్ వెల్లడించాడు. ఈ నిర్ణయం.. క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ప్రత్యేకించి కోల్ కత నైట్ రైడర్స్ లో చర్చనీయాంశమైంది.

Andre Russell Steps Away from IPL

ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ- నైట్ రైడర్స్ కేకేఆర్ పవర్ కోచ్‌గా చేరబోతోన్నానని ఆండ్రీ రస్సెల్ తెలిపాడు. 2026 సీజన్ నుంచి కొత్త క్యారెక్టర్ లోకి ప్రవేశించనున్నట్లు చెప్పాడు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కేకేఆర్ మేనేజ్మెంట్.. అతన్ని రిటెన్షన్ జాబితా నుంచి తొలగించింది. 2024 ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఈ టీమ్.. ఈ ఏడాది ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో 2026 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని నిర్ణయించుకుంది.

తన ఐపీఎల్ ప్రయాణం గురించి రస్సెల్ వివరించాడు. ఐపీఎల్ షూస్ ను పక్కన పెడుతున్నానని తేల్చి చెప్పాడు. తన స్టైల్, బ్రాండింగ్ ఎప్పట్లాగే కొనసాగుతుందని అన్నాడు. ఐపీఎల్‌లో తనదొక అద్భుతమైన ప్రయాణమని పేర్కొన్నాడు. 12 సీజన్ల జ్ఞాపకాలు, కేకేఆర్ ఫ్యామిలీ నుండి చాలా ప్రేమను పొందానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మ్యాచ్ లకు మాత్రమే దూరం అయ్యానని, 2026లో కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో పవర్ కోచ్‌గా కొత్త పాత్రలో తనను చూస్తారని అన్నాడు.

ఆండ్రీ రస్సెల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడాడు. టాప్ పెర్ఫార్మెన్స్ ఆల్ రౌండర్లల్లో ఒకడు. విన్నింగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. అటు బ్యాట్ తో, బంతితో దూకుడుగా ఆడగల అతికొద్దిమంది ప్లేయర్లల్లో రస్సెల్ ఒకడు. మొదట ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులో చేరాడు. ఇక్కడే అతనికి అసలైన గుర్తింపు లభించింది. కేకేఆర్ తరఫున 133 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రస్సెల్, 28.81 సగటుతో 2593 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 174.97.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+