Asia Cup 2025 Final: ఆసియాకప్ పాకిస్తాన్ దే- ప్రముఖ అస్ట్రాలజర్ షాకింగ్ జోస్యం..!

ఆసియాకప్ 2025లో భాగంగా రేపు దుబాయ్ లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ ఆసియాకప్ లో ఫైనల్ కు చేరుకోగా.. పాకిస్తాన్ పడుతూ లేస్తూ ఎలాగోలా ఫైనల్ కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్తాన్ కు ఫైనల్స్ లో గెలుపు రికార్డు ఘనంగా ఉంది.

ఈ నేపథ్యంలో రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అలాగే జ్యోతిష్యులు కూడా తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ సైంటిఫిక్ అస్ట్రాలజర్ గ్రీన్ స్టోన్ లోబో తన అంచనాలను వెల్లడించారు. ఈ టోర్నీలో రెండుసార్లు పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన భారత్ కు పరిస్ధితులు బాగోలేవని లోబో అంచనా వేశారు. ఈ మ్యాచ్ ను భారత్ గెలవదని, పాకిస్తాన్ టైటిల్ గెల్చుకోబోతోందని తేల్చేశారు.

Asia Cup 2025 Final Astrologer Greenstone Lobo s Big Prediction on India-Pakistan Match

భారత్ తో ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ ఎలా గెలవబోతోందన్న దానిపై జ్యోతిష్యం ప్రకారం తన విశ్లేషణను గ్రీన్ స్టోన్ లోబో బయటపెట్టారు. ఇందులో భారత్, పాకిస్తాన్ కెప్టెన్లు సూర్యకుమార్, సల్మాన్ అలీ అఘాను పోల్చారు. సల్మాన్ 1993లో పుట్టాడని, ఆ సమయంలో నెప్ట్యూన్ 25 డిగ్రీల వద్ద, ప్లూటో 0 డిగ్రీల వద్ద ఉన్నాయన్నారు. ఇది బలమైన సంకేతం అన్నారు. సూర్యకుమార్ విషయానికొస్తే అతను ప్లూటో 0 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు 1990లో పుట్టాడని తెలిపారు. కాబట్టి ఇద్దరూ బలంగా ఉన్నారన్నారు.

Asia Cup 2025 Final Astrologer Greenstone Lobo s Big Prediction on India-Pakistan Match

కానీ ఆసియా కప్ లాంటి చిన్న టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు బలమైన అవకాశాలు ఉన్నాయని లోబో వెల్లడించారు. ఒకవేళ భారత్ ఓడిపోతే, టీ20 ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు బలమైన జట్టు కోసం మార్పులు అవసరమని తెలిపారు. రెండు ఫలితాలకూ అవకాశం ఉందని, అయితే ఇందులో పాకిస్తాన్ కే కాస్త ఎక్కువ మొగ్గు ఉందని చెబుతున్నారు. జట్ల విషయంలో కాస్త తేడాలు ఉన్నాయని, కూర్పుల ప్రకారం జోతిష్యం చూస్తే ఈ మొగ్గు పాకిస్తాన్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+