Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024 Winner: ఐపీఎల్ విజేత ఎవరో తేల్చేసిన జ్యోతిష్యుడు పండిట్ ఠాకూర్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ చరమాంకానికి చేరుకుంది. ఇప్పటికే అత్యధిక విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వాలిఫయర్ 1 లో కోల్ కతా చేతిలో ఓటమిపాలైనప్పటికీ క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరుకుంది. రేపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్ పోరులో కోల్ కతా, హైదరాబాద్ జట్లు హోరాహోరీ తలపడబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ టైటిల్ ను ఎవరు ఎగరేసుకుపోతున్నారనే దానిపై జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో చర్చోప చర్చలు జరుగుతున్నాయ. ఇప్పటికే పలువురు క్రికెట్ మేథావులు, జ్యోతిష్యులు, బెట్టింగ్ సంస్థలు ఐపీఎల్ విన్నర్ పై తమ అంచనాలను వెల్లడించాయి. ఇదే క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ ఠాకూర్ తన అంచనాను కూడా వెల్లడించాడు. కోల్ కతా, హైదరాబాద్ మధ్య రేపు జరిగే ఫైనల్ లో విజేతగా నిలవబోయే జట్టుపై తన అంచనాలను 3 రోజుల ముందే ప్రకటించాడు.

astrologer pandit thakur prediction on ipl 2024 winner

రేపు జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించబోతోందని జ్యోతిష్యుడు పండిట్ ఠాకూర్ ప్రసాద్ వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అంచనాను ప్రకటించాడు. పండిట్ ఠాకూర్ తన అంచనా వెనుక కారణాలను కూడా తెలిపాడు. తాను ఐపీఎల్ ఫైనల్ జరిగే రోజు గ్రహాల సంచారం, వాటి స్ధానాలు, అవి కదిలే తీరును బట్టి తన అంచనాలను వెల్లడిస్తున్నట్లు తెలిపాడు.

కేకేఆర్ జట్టు లైనప్ ను చూస్తే ఆటగాళ్లలో చిత్తశుద్ధి, అభిరుచితో పాటు శక్తి, అంకితభావం ఉన్నట్లు తేలిందని పండిట్ ఠాకూర్ వెల్లడించాడు. అదే వారి అవకాశాలకు సూచన అన్నాడు. మధ్య ఓవర్లలో కాస్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ అంతిమంగా కోల్ కతా జట్టు ఫైనల్లో విజయం సాధించడం ఖాయమన్నాడు. చివరి క్వాలిఫయర్‌లో బలీయమైన ప్రత్యర్థిపై వారు సాధించిన విజయం వారి స్థానాన్ని మరింత పటిష్టం చేసిందన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+