టీమ్ ఇండియాపై బీసీసీఐ ఆంక్షల కొరడా..! వీటిని ఉల్లంఘిస్తే చర్యలే..!

స్వదేశంలో న్యూజీలాండ్ తో టెస్టు సిరీస్, విదేశాల్లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియాపై అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో బీసీసీఐ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై గుర్రుగా ఉంది. ఈ వరుస ఓటముల వెనుక కారణాలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్న బీసీసీఐ ఒక్కొక్కటిగా కొరడా ఝళిపిస్తోంది. ఇవాళ ఏకంగా క్రికెటర్లకు 10 పాయింట్ల విప్ ను జారీ చేసింది. వీటిని ఆటగాళ్లు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

క్రమశిక్షణ, ఐక్యత, సానుకూల జట్టు వాతావరణాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఈ పది పాయింట్ల మార్గదర్శక పత్రాన్ని పంపింది. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత క్రికెట్‌లో కీలక నిర్ణయాధికారులతో గత వారాంతంలో జరిగిన సమీక్షా సమావేశంలో చేసిన సూచనల ఆధారంగా బీసీసీఐ ఈ పత్రాన్ని రూపొందించింది.

BCCI s major crackdown on men s cricket team issued 10 point whip warns action on violation

తాజా ఆంక్షల ప్రకారం ఇకపై ఆటగాళ్ళు పర్యటనలు, మ్యాచ్‌లు, శిక్షణ కోసం విడిగా ప్రయాణాలు చేయకూడదు. ఒక ఆటగాడు మ్యాచ్‌లు, శిక్షణా సెషన్‌లకు విడిగా ప్రయాణించడానికి ప్రధాన కోచ్ లేదా హెడ్ సెలెక్టర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. అలాగే కుటుంబాలతో ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు అనుమతించరు. ఆటగాళ్ళు షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ సెషన్‌ల మొత్తం వ్యవధిలో అక్కడే ఉండాలి. మ్యాచ్ అనుకున్నదానికంటే ముందే ముగిసినా ఆటగాళ్లు ఒక పర్యటన లేదా సిరీస్‌ను రద్దు చేసుకుని ముందే వెళ్లిపోయేందుకు అనుమతించరు.

సుదీర్ఘ పర్యటనలలో అయినా ఆటగాళ్ల కుటుంబాలు గరిష్టంగా రెండు వారాల పాటు మాత్రమే వారితో ఉండేందుకు అనుమతిస్తారు. ఆటగాళ్లతో అనుమతించే గెస్ట్ ల ఖర్చులన్నీ వారే భరించాలి. ఆటగాళ్లు టూర్లలో వ్యక్తిగత సిబ్బందిని తీసుకుని రాకూడదు. ఓ సిరీస్ జరుగుతున్నప్పుడు కమర్షియల్ యాడ్లు, షూట్స్ కు ఆటగాళ్లను అనుమతించరు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ప్రతీ ఆటగాడూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకునేందుకు వీల్లేదు. అత్యవసర పరిస్ధితుల్లో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అనుమతితో మాత్రమే వీటికి మినహాయింపు ఇస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం క్రమశిక్షణా చర్యలు తప్పవని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+