Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (ipl 202)నడుస్తోంది. ముఖ్యంగా యూత్, క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో వేసవి వేడిని కూడా తట్టుకుని స్టేడియాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేసే ఆఫర్లు కూడా ర్కెట్లలో కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా బెంగళూరు పోలీసులు (Bengaluru police) కూడా ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతో అభిమానులు ఫ్రీ టికెట్ల కోసం ఎగబడ్డారు.

బెంగళూరు పోలీసులు పెట్టిన ట్వీట్ లో ఓ లింక్ పెట్టారు. ఫ్రీ ఐపీఎల్ టికెట్లు కావాలంటే సదరు లింక్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సైబర్ నేరాల కాలంలో ఏదైనా తెలియని లింక్ క్లిక్ చేయొద్దంటూ చెప్పే పోలీసులే స్వయంగా ఈ లింక్ క్లిక్ చేయమని సూచించడంతో అభిమానులు ఉచిత టికెట్ల కోసం భారీ ఎత్తున ఆ లింక్స్ ను క్లిక్ చేస్తున్నారు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసిన వారికి మాత్రం ఆ ట్విస్ట్ తెలుస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వారికి టిక్కెట్ బుకింగ్ పేజీకి బదులుగా, యూజర్లు ఓ డిజైనర్ స్క్రీన్‌ లోకి వెళ్తున్నారు. దానిపై "ఏప్రిల్ ఫూల్, మిమ్మల్ని ఆటపట్టించారు!" అని రాసి ఉంది.

Bengaluru Police s Free IPL Ticket Scam An April Fools Prank with a Serious Cyber Safety Lesson

ఇది ఒక హానిచేయని జోక్ అని, ఇందులో ఎలాంటి మాల్‌వేర్ లేదని ఆ పేజీలో పోలీసులు తెలిపారు. ఇంకాస్త కిందకు స్క్రోల్ చేస్తే.. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన ఒక వివరణాత్మక డిజిటల్ భద్రతా మార్గదర్శి అని తెలుస్తోంది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఆఫర్లు, ఆన్‌లైన్ మోసాలు సర్వసాధారణంగా మారుతున్న ఈ కాలంలో సురక్షితంగా ఉండటానికి ఆచరణాత్మక చిట్కాలను అందిస్తూ, ఆ పేజీలో "ఆన్‌లైన్‌లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు" అనే శీర్షికతో ఒక విభాగం పెట్టారు. దీనిపై నెట్లో మిశ్రమ స్పందన వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+