ఆ ప్లేయర్‌ను వదులుకుని కావ్య పాప పెద్ద తప్పు చేసిందా..?
ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం పాట రెండో రోజు కూడా కొనసాగుతోంది. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం నేడు, రేపు జరగనుండగా.. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకుంటున్నాయి. మొదటి రోజు కేఎల్ రాహుల్, రిషప్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లను వేలంలో ఆయా జట్లు దక్కించుకున్నాయి.
రెండో రోజు కూడా పలు కీలక ఆటగాళ్లు వేలంలో అందుబాటులోకి వచ్చారు. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సరిదిద్దుకోలేని తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్టార్ భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వదులుకుంది. భువనేశ్వర్ గతంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తనదైన బౌలింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. అలాంటి ప్లేయర్‌ను సన్‌రైజర్స్ వదులుకోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో కనీస ధర రూ.2 కోట్లతో అందుబాటులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. భువనేశ్వర్ కుమార్ కోసం LSG,ముంబై ,RCB జట్లు పోటీ పడ్డాయి.భువనేశ్వర్ కోసం సన్‌రైజర్స్ ఒక్కసారి కూడా సన్‌రైజర్స్ బిడ్ వేయకపోవడం విశేషం. చివరికి రూ. 10.75 కోట్లతో RCB జట్టు భువనేశ్వర్ కుమార్‌ను దక్కించుకుంది.












Click it and Unblock the Notifications