MI vs CSK: ముంబైకి బిగ్ బూస్ట్- సీఎస్కే మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ.!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భారీ అంచనాలకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడితే నాలుగు మ్యాచ్ లు ఓడి, రెండు గెలిచింది. జట్టులో ఎంతో మంది స్టార్లు ఉన్నా అవసరానికి ఒక్కరూ పనికి రావట్లేదు. అడపాదడపా మెరుపులు తప్ప నిలకడైన ప్రదర్శన లేదు. దీంతో ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైతో జరిగే మ్యాచ్ (MI vs CSK) కు సిద్ధమవుతున్న ముంబైకి ఓ భారీ గుడ్ న్యూస్ అందింది.
ముందస్తు ఒప్పందాల కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జేక్స్ (will jacks) ముంబై ఇండియన్స్ కు అందుబాటులోకి వచ్చాడు. అతను జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడని ముంబై ఘనంగా ప్రకటించుకుంది.
ముందస్తు ఒప్పందాలు పూర్తి చేసుకున్న విల్ జాక్స్ సీఎస్కే మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ధృవీకరించింది. ఇంగ్లాండ్‌తో అత్యంత బిజీగా ఉన్న అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఎక్కువ విరామం కోరడంతో, జాక్స్ ఐపీఎల్ 2026 ప్రారంభంలో జట్టులో చేరలేదు.

జేక్స్ రాకతో ముంబై జట్టుకు ఒక నాణ్యమైన బ్యాటింగ్ ఎంపిక తోడవుతుంది. అంతేకాకుండా, మ్యాచ్‌లను బట్టి ఉపయోగించుకోగల పార్ట్-టైమ్ ఆఫ్-స్పిన్ కూడా అందుబాటులో ఉంటాడు. జాక్స్ టాప్ ఆర్డర్‌లో పలు స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడు. అలాగే గతంలో పవర్‌ప్లే సమయంలో దూకుడుగా ఆడే బౌలర్‌గా పనికొచ్చాడు. అతని ఆఫ్-స్పిన్, ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లకు పరీక్షే. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు, జాక్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2026లో ఇంగ్లండ్ తరఫున నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. దీంతో జేక్స్ పై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి.














Click it and Unblock the Notifications