Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024: శాసించేది వారిద్దరే: క్రిస్ గేల్

డెహ్రాడూన్: వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ క్రిస్ గేల్.. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్నారు. లెజెండరీ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. వయస్సు మీద పడినప్పటికీ.. బ్యాటింగ్ దూకుడు మాత్రం తగ్గట్లేదు. మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడీ డాషింగ్ ఓపెనర్.

తన తదుపరి మ్యాచ్ ఆడటానికి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఐఎఎన్ఎస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) పైనా తన అంచనాలను వ్యక్తం చేశారు.

Chris Gayle praises Rohit Sharma and Virat Kohli

టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడుతోన్న సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం కావడంపై మాట్లాడారు క్రిస్ గేల్. వారిద్దరూ అలసిపోయారనే కారణంతో టీ20 మ్యాచ్‌లకు దూరం అయ్యారని చెప్పడం సరికాదని, సుదీర్ఘ క్రికెట్ ఆడగల సత్తా వారిద్దరికీ ఉందని చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడదలచుకుంటే వారిని ఎవరూ ఆపలేరనీ క్రిస్ గేల్ పేర్కొన్నారు. దేశం కోసం ఎంతో క్రికెట్ ఆడిన వారిద్దరికీ టీ20 వరల్డ్ కప్ ఆడే ఆ అర్హత ఉందని అన్నారు. ఎలాంటి బౌలర్‌ను అయినా ఎదుర్కొనగల సత్తా ఉన్న సమకాలీన బ్యాటర్లు వారిద్దరేనని పేర్కొన్నారు.

Chris Gayle praises Rohit Sharma and Virat Kohli

తన సిక్సుల రికార్డులను రోహిత్ శర్మ చెరిపేయడంపైనా మాట్లాడారు క్రిస్ గేల్. బ్యాటింగ్‌లో అతని దూకుడు తనకు నచ్చుతుందని వ్యాఖ్యానించారు. బౌలర్లపై విరుచుకుపడటానికే తాను ఇష్టపడతానని, ఇప్పుడు అలాంటి వైఖరి, అలాంటి బ్యాటింగ్‌ను మళ్లీ రోహిత్ శర్మలో చూస్తోన్నానని అన్నారు.

సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడంపై గేల్ స్పందించారు. కోహ్లీ 50 సెంచరీలు చేశాడంటే తాను నమ్మలేకపోతున్నానని, సచిన్ టెండుల్కర్ రికార్డును చెరిపేయడం అనేది ఓ అద్భుతమని చెప్పారు. ఇక కోహ్లీ రికార్డును మరెవరూ బ్రేక్ చేయలేరని తేల్చి చెప్పారు.

లెజెండ్ లీగ్‌ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడటంపై గేల్ బదులిచ్చారు. క్రికెట్టే తన జీవితమని, అది తన రక్తంలో కలిసిపోయిందని అన్నారు. అందుకే ఇలాంటి లీగ్ టోర్నమెంట్లల్లో వచ్చే అవకాశాన్ని వదులకోనని గేల్ పేర్కొన్నారు. లెజెండ్ లీగ్స్‌లో ఆడటం అద్భుతంగా ఉందని, తన సమకాలీన క్రికెటర్లతో కలిసి ఆడటం మరిచిపోలేనని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+