సీఎం విజయ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. భారీ నజరానా! (వీడియో)

నార్వే చెస్ 2026 టోర్నీలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. చెన్నై సెక్రటేరియట్‌లో ప్రజ్ఞానందతో భేటీ అయిన సీఎం విజయ్.. ఆయన ఘనతను కొనియాడుతూ రూ.50 లక్షల ప్రత్యేక నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్, ప్రజ్ఞానంద మధ్య జరిగిన ఓ ఫ్రెండ్లీ చెస్ గేమ్ ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొన్ని ఎత్తుల్లోనే చెక్ మేట్
ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రజ్ఞానందతో కలిసి చెస్ ఆడారు. ఈ సరదా మ్యాచ్‌లో అంతర్జాతీయ దిగ్గజాలను ఓడించిన ప్రజ్ఞానంద.. కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజయ్‌ను చెక్‌మేట్ చేశారు. విపక్షాలు, పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ముఖ్యమంత్రి ఈ గేమ్‌ను ఎంతో ఉత్సాహంగా ఆడటం విశేషం. చెస్ ఆడుతున్న సమయంలో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న విజువల్స్‌ను తమిళనాడు సమాచార, పౌరసంబంధాల శాఖ విడుదల చేసింది.

CM Vijay vs Praggnanandhaa Chess Prodigy Checkmates Tamil Nadu CM Wins Rs 50 Lakh Full Details

ప్రజ్ఞానంద ఆనందం
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "సీఎం విజయ్ గారితో చెస్ ఆడతానని నేను అస్సలు ఊహించలేదు. ఇదొక బిగ్ సర్‌ప్రైజ్, మధురమైన క్షణం. ఆయన టేబుల్ పైనే మేం చెస్ బోర్డు పెట్టి ఆడాం. సీఎం గారు చాలా బాగా ఆడారు. తన స్నేహితులతో కలిసి గతంలో చెస్ ఆడేవాడినని ఆయన నాతో చెప్పారు. ఈ మ్యాచ్‌లో నేను గెలిచినప్పటికీ.. ఆయన ఆటతీరు చాలా బాగుంది. ప్రభుత్వం అందించిన ఈ రూ.50 లక్షల ప్రోత్సాహకం నాకు మరింత స్ఫూర్తిని ఇస్తుంది" అని ప్రజ్ఞానంద వెల్లడించాడు.

నార్వే చెస్ టోర్నీలో చారిత్రాత్మక రికార్డు
నార్వేలోని ఓస్లోలో జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టోర్నీలో ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. చివరి, పదో రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌ను ఓడించడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్‌లో విజయాలు సాధించి కెరీర్లోనే అతిపెద్ద టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు సృష్టించాడు.

దిగ్గజాలను వెనక్కి నెట్టి అగ్రస్థానం
ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో వంటి ప్రపంచ స్థాయి మేధావులు బరిలో నిలిచారు. వీరిందరినీ వెనక్కి నెట్టి చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలిచాడు. ముఖ్యంగా ఈ టోర్నీలో నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం చెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అద్భుతమైన విషయంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+