టీమిండియాపై న్యూజిలాండ్‌దే ఆధిపత్యం- లెక్కలు ఇవే..!!
సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ను ఓడించింది న్యూజిలాండ్. ఆయా మ్యాచ్‌లన్నీ కూడా ఏకపక్షంగా సాగాయి. టీమిండియాదీ అదే పరిస్థితి. ఆస్ట్రేలియాను మట్టికరిపించడంతో మొదలైంది రోహిత్ సేన జైత్రయాత్ర. బ్రేకుల్లేకుండా సాగుతోంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయాలను అందుకుంది.
ఇప్పటివరకు ఓటమి అనేది తెలియని జట్లు ఏవైనా ఉన్నాయంటే అది భారత్, న్యూజిలాండ్. టేబుల్ టాపర్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ధర్మశాల స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఓడినా.. ఆ జట్టుకు తొలి ఓటమి అవుతుంది.
ఈ రెండు జట్లూ ముందు నుంచీ సమవుజ్జీగా ఉంటూ వస్తోన్నాయి. మొత్తం మీద భారత్- న్యూజిలాండ్ మధ్య 116 వన్డే ఇంటర్నేషనల్స్ జరిగాయి. అత్యధికంగా భారత్ 58 సార్లు న్యూజిలాండ్‌పై గెలిచింది. 50 మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఒక్కటి మాత్రం టైగా ముగిసింది.
వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో మాత్రం భారత్‌పై న్యూజిలాండ్‌దే ఆధిపత్యం. మొత్తంగా తొమ్మిదిసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాటిల్లో అయిదు మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ మూడుసార్లు గెలిచింది. ఒక్క మ్యాచ్ టై అయింది. ఇక నేటి గేమ్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠతను రేపుతోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications