బ్లాక్ క్యాప్స్ తడాఖా- భారత బౌలర్లు బేజార్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత కుదురుకుంది. ఇప్పుడు తడాఖా చూపుతోంది. టీమిండియా బౌలర్లను చీల్చి చెండాడుతోంది. ఈ క్రమంలో రెండు మెరుపు సెంచరీలు నమోదయ్యాయి. దీంతో భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది న్యూజిలాండ్ జట్టు.

నిజానికి- న్యూజిలాండ్ ఇన్నింగ్ వరస్ట్ గా ప్రారంభమైంది. తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లను కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ హెన్రీ నికొలస్ అవుట్ అయ్యాడు. అతనికి ఇది గోల్డెన్ డకౌట్. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంగా దూసుకొచ్చిన బంతిని ఆడటంలో తడబడ్డాడు నికొలస్. బ్యాట్ ను అడ్డుపెట్టాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ డెలివరీ వికెట్లను ఎగురగొట్టింది. దీంతో అయిదు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్.

Daryl Mitchell Shines with Consecutive Century and Glenn Philips ton Against India in 3rd ODI

రెండో ఓవర్ లో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా తన తొలి బంతికి అద్భుతమైన డెలివరీతో కాన్వే వికెట్ తీశాడు. ఆఫ్ స్టంప్ వెలుపల నుండి లోపలికి స్వింగ్ అయిన ఆ లెంగ్త్ బంతి నేరుగా వికెట్ల మీదికి దూసుకొచ్చింది. దాన్ని కాన్వే డిఫెన్స్ ఆడబోయాడు. బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచిన ఆ బంతిని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. రానా బౌలింగ్‌లో కాన్వే అవుట్ కావడం ఇది మూడోసారి.

జట్టు స్కోరు 58 పరుగుల వద్ద ఉన్నప్పుడు మూడో వికెట్ పడింది. ఈ వికెట్ కూడా రాణా ఖాతాలోనే పడింది. ఈ దఫా విల్ యంగ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ అండ్ వైడ్‌గా వచ్చిన డెలివరీని విల్ యంగ్ కట్ షాట్ ఆడాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. బౌండరీ వైపు గాల్లోకి లేచిన ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా అందుకున్నాడు. కుడివైపు డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టాడు.

విల్ యంగ్ స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్.. అప్పటికే పాతుకుపోయిన డారిల్ మిఛెల్.. టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తడాఖా చూపారు. చెలరేగారు. ఈ క్రమంలో మిఛెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా నాలుగు వన్డేల్లో ఇది మూడోసెంచరీ. భారత్ పై వరుసగా రెండో సెంచరీ. మొత్తంగా వన్డేల్లో తొమ్మిదో సెంచరీని అందుకున్నాడు మిఛెల్. మరోవంక ఫిలిప్స్ కూడా చెలరేగాడు. 84 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో సెంచరీ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+