శిఖర్ ధావన్ విడాకులు, భార్య వేధింపులు - వెలుగులోకి సంచలన అంశాలు..!!
ఇటు ప్రపంచ కప్ సమరం ఆరంభం అవుతోంది. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది. అయితే విచారణ సమయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధావన్ పడిన మానసిక వేదన కోర్టు దృష్టికి వచ్చింది.
ధావన్ కు విడాకులు : టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందంటూ ధావన్ తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. కుమారుడితో కొన్నాళ్లపాటు విడిగా ఉండాలని ఆయేషా ముఖర్జీ ఒత్తిడికి గురి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అయితే వారి కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. కానీ ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడు జోరావర్‌ను చూసేందుకు మాత్రం ధావన్‌కు కోర్టు అనుమతించింది. స్కూల్ అకడమిక్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలవుల్లో ధావన్, అతని కుటుంబసభ్యులను కలిసేందుకు జోరావర్‌ను ఇండియాకు తీసుకురావాలని ఆయేషాను కోర్టు ఆదేశించింది.
వేధింపులే కారణం : వివాహానికి ముందు ధావన్‌తో కలిసి ఇండియాలో నివసించేందుకు ఆయేషా అంగీకరించిందని న్యాయవాదులు వివరించారు. కానీ ఆమెకు అప్పటికే మొదటి వివాహం ద్వారా జన్మించిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ధావన్‌కు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఇండియాలో ఎక్కువ కాలం నివసించలేదన్నారు.

కుమారుడు జోరావర్‌ను కూడా ఆస్ట్రేలియాలోనే పెంచిందని చెప్పారు. ఇందులో ధావన్ తప్పు లేకున్నా అతనికి కుమారుడిని దూరం చేసిన ఆయేషా మానసిక ఆవేదనకు గురిచేసిందని నివేదించారు. అలాగే ధావన్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో ఒకదానిని 99 శాతం తన పేరిట రాయాలాని ఆయేషా ఒత్తిడి చేసిందిని వివరించారు. మిగిలిన రెండు ఆస్తుల్లో తనను ఉమ్మడి యజమానిగా ఉంచాలని ధావన్‌ను వేధించిందని కోర్టుకు చెప్పారు.
కోర్టు అనుమతి : ధావన్-ఆయేషాలకు 2012లో వివాహం జరిగింది. ధావన్ కన్నా ఆయేషా 10 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ కుటుంబసభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాడు. అలాగే ఆయేషాకు అప్పటికే వివాహం అయి ఇద్దరు కూతుళ్లు ఉండడంతో వారిని కూడా స్వీకరించాడు. ఆ తర్వాత ధావన్-ఆయేషా దంపతులకు 2014లో జోరావర్ పుట్టాడు. ఇక కొన్నేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులు తాజాగా విడాకులు తీసుకున్నారు. ధావన్ ఏ రకంగా వేధింపులు ఎదుర్కొందీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. అలాగే వీడియో కాల్స్ ద్వారా ధావన్ తన కొడుకుతో టచ్‌లో ఉండేందుకు కూడా కోర్టు అనుమతించింది.












Click it and Unblock the Notifications