Dinesh Karthik: కొత్త పాత్రలో దినేష్ కార్తీక్- దక్షిణాఫ్రికాలో రీఎంట్రీ..!
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ ఇప్పుడు విదేశాల్లో రీఎంట్రీకి సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ క్రికెట్ లో స్టార్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న దినేష్ కార్తీక్ ను రిటైర్మెంట్ తర్వాత కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇందులో తనకు నచ్చిన ఓ అవకాశానికి సై అనేశాడు. దీంతో ఇప్పుడు ఈ తమిళనాడు కీపర్ బ్యాట్స్ మెన్ నిర్ణయంపై చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది జూన్ 1న దినేష్ కార్తీక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఐపీఎల్ లో గతంలో తాను ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సహచరుడు ఏబీ డివిలియర్స్ నుంచి కాల్ వచ్చింది. దక్షిణాఫ్రిలో జరుగుతున్న ఇలాంటిదే లీగ్ ఎస్ఏ 20 వచ్చే ఎడిషన్ లో ఆడేందుకు పిలుపువచ్చింది. అంతే కాదు ఈ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా డివిలియర్స్ తో పాటు దినేష్ కార్తీక్ నూ నిర్వాహకులు ఎంచుకున్నారు. దీంతో డబుల్ బొనాంజా ఆఫర్ తగిలినట్లయింది.

దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జరిగే ఎస్ఏ 20 2025 ఎడిషన్ కోసం దినేష్ కార్తీక్ ను లీగ్ లో ని పార్ల్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్లేయర్ గా కాదు. బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్ గా ఎంచుకుంది. దీంతో భారత్ నుంచి ఇలా దక్షిణాఫ్రికా ఎస్ఏ20 లీగ్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా దినేష్ కార్తీక్ రికార్డు సృష్టించాడు. భారత్ తరపున 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కార్తీక్..చివరిసారిగా ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. ఈ తమిళనాడు క్రికెటర్‌కు 257 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు, 401 టీ20లు ఆడిన అనుభవం ఉంది. అలాగే కామెంటేటర్ గానూ పనిచేసిన అనుభవం ఉంది.












Click it and Unblock the Notifications