ఇంగ్లాండ్ బౌలర్లను అలా ఉతికి ఆరేశావేంట్రా..!!

Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెలరేగింది. ఇంగ్లాండ్‌ బౌలర్ల దుమ్ము దులిపింది. భారీ స్కోర్ సాధించింది. ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.. ప్రత్యేకించి- ఇబ్రహీం జడ్రాన్.

గ్రూప్ బీలో భాగంగా లాహోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఆఫ్ఘనిస్తాన్. నిర్ణీత 50 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. 37 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో మిడిలార్డర్ బ్యాటర్లు తెగువ చూపారు. తెగించి పోరాడారు.

ENG vs AFG Ibrahim Zadran breaks all Champions Trophy records as he made 177 runs from 146 balls

ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్- 6, సెదికుల్లా అటల్- 4, రహ్మత్ షా- 4 పరుగులకు అవుట్ అయ్యారు. మరో ఎండ్‌లో మరో ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 146 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లు, 12 మెరుపుల్లాంటి బౌండరీలతో 177 పరుగులు పిండుకున్నాడు.

మిడిలార్డర్‌లో అతనికి పూర్తి సహకారాన్ని అందంచారు కేప్టెన్ హస్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ. షాహిదీ- 40, ఒమర్జాయ్- 41, నబీ- 40 పరుగులు చేశారు. ఈ నలుగురి దూకుడు బ్యాటింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఏకంగా 325 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది ఇంగ్లాండ్‌కు.

చివరి తొమ్మిది ఓవర్లల్లో 108 పరుగులు రాబట్టుకున్నారు ఆఫ్ఘన్ బ్యాటర్లు. 44, 47వ ఓవర్లల్లో అయితే మరీనూ. 20, 23 పరుగులు కొట్టారు. ఇబ్రహీం జడ్రాన్ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ తురుఫుముక్క జోఫ్రా అర్చర్ బలి అయ్యాడు. 42వ ఓవర్‌లో 6,0,2,4,4,4 సమర్పించుకున్నాడు.

ఇబ్రహీం జడ్రాన్ భారీ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలోని రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ చేసిన 165 పరుగులే అత్యధికం ఈ ట్రోఫీలో. అది కూడా ఇటీవలే ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు డకెట్. అది అతి త్వరగా బద్దలైపోతుందని ఎవరూ ఊహించివుండరు కూడా.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు సెంచరీలు కొట్టిన వారిలో జడ్రాన్, బెన్ డకెట్‌తో పాటు నాథన్ ఆస్టిల్- 145, ఆండీ ఫ్లవర్- 145, సౌరవ్ గంగూలీ- 141, సచిన్ టెండుల్కర్- 141, గ్రేమ్ స్మిత్- 141 ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+