ఆసియాకప్ లో భారత్-పాక్ మ్యాచ్ జరగదు..! కేదార్ జాదవ్ జోస్యం..!
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడేందుకు టీమిండియా నిరాకరించింది. తటస్ధ వేదిక అయిన బ్రిటన్ లో జట్టులో సీనియర్ ఆటగాళ్లంతా పాకిస్తాన్ తో ఆడబోమని తేల్చేయడంతో ఈ మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ సెమీ పైనల్ చేరినా అక్కడా ఆ దేశంతో ఆడేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. చివరికి పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుని అక్కడ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.
ఆ తర్వాత ఆసియా కప్ లో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ మ్యాచ్ ను కూడా భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది. ఈ టోర్నీ ఆతిధ్య దేశమైనా పాకిస్తాన్ తో తటస్థ వేదికైన దుబాయ్ లో ఆడేందుకు సిద్ధమవుతున్న టీమ్ కు మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ షాకింగ్ వార్త చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నప్పటికీ ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని కేదార్ జాదవ్ జోస్యం చెప్పాడు. పాకిస్తాన్ తో భారత్ ఆడే ప్రసక్తే లేదన్నాడు. తన అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్ ను భారత్ ఆడకూదడదన్నాడు. భారత్ ఎక్కడ ఆడినా గెలుస్తుందని, కానీ ఈ మ్యాచ్ కు మాత్రం దూరంగా ఉండాలని కేదార్ తెలిపాడు. పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని ఈ సందర్బంగా కేదార్ జాదవ్ వెల్లడించాడు.

#WATCH | Pune: On India to face Pakistan in the Asia Cup 2025, Former Indian Cricketer and BJP leader Kedar Jadhav says, "I think the Indian team should not play at all. As far as India is concerned, I think that wherever India plays, it will always win, but this match should not… pic.twitter.com/M83rUBXJnc
— ANI (@ANI) August 17, 2025
ఆసియా కప్ లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ గ్రూప్ ఏ లో పోటీ పడుతోంది. ఇదే గ్రూప్ లో ఆతిధ్య యూఏఈ, ఒమన్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. దీంతో భారత్-పాక్ మ్యాచ్ ను సెప్టెంబర్ 14న షెడ్యూల్ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే బీసీసీఐ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.












Click it and Unblock the Notifications