FIFA World Cup 2026 Winner: ఫిఫా వరల్డ్ కప్ వారికే-తేల్చేసిన ఏఐ మోడల్స్..!
సాకర్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ దశకు చేరుకుంది. ఎల్లుండి జరిగే ఫైనల్ కు ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. సోమవారం జరిగే టైటిల్ పోరులో స్పెయిన్, అర్జెంటీనా జట్లు అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. హేమాహేమీల్లాంటి అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగే పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇరు జట్లలో విజేత అయ్యేదెవరన్న దానిపైనా పలు అంచనాలు వెలువడుతున్నాయి.
ఇదే క్రమంలో సోమవారం జరిగే సాకర్ వరల్డ్ కప్ ఫైనల్లో విజేతపై (FIFA World Cup 2026 Winner) ఏఐ ఫ్లాట్ ఫామ్స్ తన అంచనాలను వెల్లడించాయి. వీటి ప్రకారం ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ గెలుపు సాధిస్తుందని దాదాపుగా ఏఐ మోడల్స్ అన్నీ అంచనా వేశాయి. అలాగే దీని వెనుక ఉన్న ప్రధాన కారణాల్ని కూడా వెల్లడించాయి. జట్టులో అన్ని స్థానాల్లో అద్భుతమైన స్క్వాడ్ లోతు కలిగి ఉండటం, టోర్నీలోని అత్యంత పటిష్టమైన డిఫెన్స్ రికార్డులలో ఒకటి కలిగి ఉండటం. అధిక బాల్ పొసెషన్ , అవకాశాలను సృష్టించే గణాంకాలు స్పెయిన్ కు ఆధిక్యం కట్టబెడుతున్నాయి.

అనుభవజ్ఞులైన మిడ్‌ఫీల్డర్ల మద్దతుతో లామిన్ యమాల్, నికో విలియమ్స్ వంటి యువ ప్లేయర్ల అండ, అగ్రశ్రేణి ప్రత్యర్థులపై స్థిరమైన ప్రదర్శనలు కూడా స్పెయిన్ కు ఆధిక్యం ఇవ్వడం వెనుక కీలక కారణాలుగా ఉన్నాయి. అయితే అర్జెంటీనా కూడా టైటిల్ పోరులో రెండో స్ధానంలో ఉండేందుకు ఉన్న కారణాల్లో బలమైన టోర్నమెంట్ అనుభవం కలిగి ఉండటం, ప్రపంచ స్థాయి నాయకత్వం, మ్యాచ్ గెలిపించే సామర్థ్యం, నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతమైన వ్యూహాల ప్రయోగం వంటివి ఆ జట్టుకు ప్లస్ కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి ఏఐ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలంటే మరో 48 గంటలు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications