జనవరి 15 వరకూ అన్ని మ్యాచ్ లు అక్కడే..! బీసీసీఐ కీలక నిర్ణయం..!
లక్నోలోని ఎకానా స్టేడియంలో నిన్న భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే మంచు కారణంగా రద్దు కావడం తీవ్ర దుమారం రేపుతోంది. మంచు ఉంటుందని తెలిసినా బీసీసీఐ ఇలా మ్యాచ్ పెట్టడం ఎందుకు, రద్దు చేయడం ఎందుకని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో సైతం మంచు ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో మంచు కురిసే ఈ సీజన్ లో బీసీసీఐ పలు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు దేశవాళీ టోర్నీలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇందులో జైపూర్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ల టోర్నమెంట్ డిసెంబర్ 24 నుండి జనవరి 18 వరకు జరగాల్సి ఉంది. అలాగే భారత్,దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 రేపు అహ్మదాబాద్ లో జరగాల్సి ఉంది. ఆ తర్వాత భారత్-న్యూజీలాండ్ వన్డే సిరీస్ కూడా జనవరి 11 నుండి జరగాల్సి ఉంది. దీనికి వడోదర, రాజ్‌కోట్ , ఇండోర్ వేదికలుగా ఇప్పటికే నిర్ణయించారు.

అయితే తాజాగా లక్నోలో భారీ మంచు కారణంగా టీ20 మ్యాచ్ రద్దు కావడంతో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు బీసీసీఐ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఇందులో ఉత్తర భారత దేశంలోని నగరాల్లో షెడ్యూల్ చేసిన మ్యాచ్ లను దక్షిణాదికి, అలాగే పశ్చిమ భారత దేశంలోని నగరాలకు మార్చాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే భారత్-దక్షిణాఫికా చివరి టీ20 మ్యాచ్ వేదిక మార్చేందుకు సమయం లేనందున అహ్మదాబాద్ లోనే నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే విజయ్ హజారే ట్రోఫీతో పాటు భారత్-కివీస్ సిరీస్ లో మ్యాచ్ లను దక్షిణాదికి తరలిస్తారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications