IND Vs AUS: ఆసీస్ బలం అదే, టీమిండియా గెలవాలంటే: దిగ్గజ క్రికెటర్ హెచ్చరిక..!!

ప్రపంచ కప్ తుది సమరానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్లాది మంది అభిమానులు ఇండియా వర్సస్ ఆసీస్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సొంత గడ్డ పైన 12 ఏళ్ల తరువాత ఫైనల్స్ ఆడుతున్న టీం ఇండియాకు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రత్యర్ధి ఆసీస్ టీం కావటంలో దిగ్గజ క్రికెటర్లు టీం ఇండియా టైటిల్ ఫేవరెట్ గా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ సేనకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.

ఫైనల్ ఉత్కంఠ : వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్‌ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్స్‌ లోనూ ఇదే జోరు చూపించి టైటిల్‌ గెలువాలని భారత అభిమానులు కోరుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. అన్ని మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అంతేకాకుండా.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సమయంలోనే క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీం ఇండియాకు కొన్ని కీలక సూచనలు చేసారు. ఏ మాత్రం ఏమర్పాటు వద్దని హెచ్చరించారు. అదే సమయంలో ఈ ప్రపంచ కప్ లో ఆసీస్ పడి లేచిన కెరటమని గుర్తు చేసారు.

Gavaskars Advice to Team India ahead of World Cup Fiinal Clash against Australia

గవాస్కర్ సూచనలు : ఇప్పటి వరకు రోహిత్ టీం ఏ విధంగా ఆడుతూ వచ్చిందో ఫైనల్స్ లోనూ అదే కొనసాగించాలని సూచించారు. ఏ మాత్రం ఏమర్పాటుతో ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సొంత గడ్డపై ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని టీమిండియాకు అహ్మదాబాద్ కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆరంభ మ్యాచ్ లలో ఓటమిని చవి చూసిన ఆసీసీ్ ఆ తరువాత వరుస విజయాలతో తుది పోరుకు అర్హత సాధించిన తీరు గుర్తుంచుకోవాలన్నారు. ఆఫ్ఠనిస్తాన్ తో ఓడిపోయే మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ఒక్కడే విజయం అదించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సెమీస్ లో ఓపెన్ ట్రవిస్ హెడ్ బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ రాణించాడు. ఇప్పటి వరకు అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆసీస్ ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయద్దని గవాస్కర్ సూచించారు.

Gavaskars Advice to Team India ahead of World Cup Fiinal Clash against Australia

టైటిల్ ఫేవరెట్ గా : టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్ గా ఉందన్నారు. ఆసీస్ ఆటగాళ్లలో గెలవాలనే కసి ఎక్కువగా ఉంటుందన్నారు. కాగా, అహ్మదాబాద్ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ - ఆసీస్ డిప్యూటీ పీఎం మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షనుంచనున్నారు. టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రపంచకప్‌ ను భారత్‌ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రిడిక్షన్స్‌ చెబుతున్నాయి. దీంతో, లక్ష మందికి పైగా హాజరయ్యే అభిమానుల సమక్షంలో టీమిండియాకు లభించే మద్దతు..కోట్లాది మంది విషెస్ నడుమ..ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఫైనల్ పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+