నోట మాట రావట్లేదండి

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది వారికి వరుసగా నాలుగో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 పరుగులు నాటౌట్) అద్భుత శతకం సాధించినా, జట్టు విజయం సాధించలేకపోయింది. డికాక్, నమన్ ధీర్ (50) తో 68 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 22 పరుగులకి మూడు వికెట్లు తీయగా, శశాంక్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బౌలర్ అల్లా గజన్‌ఫర్ రెండు వికెట్లు తీసినా అది జట్టుకు విజయానికి సరిపోలేదు. పంజాబ్ విజయంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 పరుగులు నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66 పరుగులు) కీలక పాత్ర పోషించారు. మూడో వికెట్ కోసం 67 బంతుల్లో 139 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Hardik Pandya Vows to Go Back to the Drawing Board After Defeat by PBKS Planning and Leadership

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. జట్టుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు. మ్యాచ్ అనంతరం తీవ్ర నిరాశలో కనిపించాడు హార్దిక్. జట్టు ప్రదర్శన గురించి సానుకూల వ్యాఖ్యలు చేయలేకపోయాడు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి తిరిగి ప్రణాళికలు వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని హార్దిక్ పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని చెప్పాడు. ప్రస్తుతానికిచెప్పడానికి ఏమీ లేదని, లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.

తోపం అనేది ప్లేయర్లలో ఉందా, ఓటముల బాధ్యత జట్టు మొత్తానిదా? లేక ప్రణాళికలో పొరపాట్లు ఉన్నాయా అనేది త్వరలోనే చర్చించి, తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని హార్దిక్ పాండ్యా చెప్పాడు. పంజాబ్ కింగ్స్ ను ప్రశంసించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించారని, అన్ని డిపార్ట్ మెంట్ లల్లో తమను అధిగమించి, గెలుపును సొంతం చేసుకున్నారని కితాబిచ్చాడు. జట్టులో ఎలాంటి మార్పులు అవసరం అనే ప్రశ్నకు తనకు తెలియదని పాండ్యా నిస్సంకోచంగా అంగీకరించాడు.

కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలా, లేదా ఇదే జట్టుతోనే పరిస్థితిని మార్చుకోగలమని ఆశించాలా అనేది పరిశీలించాల్సి ఉందని, కొన్ని కఠోర ప్రశ్నలకు సమాధానాలను వెదుక్కోవాలని, బాధ్యత తీసుకోవాల్సి ఉందని చెప్పాడు. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లోనే నెగ్గింది ముంబై. ఇది వరుసగా నాలుగో ఓటమి. రెండు పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+