2026లో టీమ్​ ఇండియా బిజీ షెడ్యూల్: రోహిత్- కోహ్లీ ఆడే మ్యాచ్‌ల లిస్టు..!!

ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల తో టీమిండియా 2026లో అడుగు పెట్టింది. టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టెస్టు క్రికెట్ లో ప్రాభవం కోల్పోయిన టీం ఇండియాకు ఈ ఏడాది కీలకం కానుంది. ఇక.. రోహిత్ - కోహ్లీ కాంబో ఆడే మ్యాచ్ లపైన ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు ఆడే మ్యాచ్ ల డేట్స్ ఫైనల్ అయ్యాయి. అదే విధంగా ఐపీఎల్ సైతం ఫ్యాన్స్ కు మంచి మజా అందించనుంది.

టీం ఇండియా 2026 లో బిజీ షెడ్యూల్ తో సిద్దం అవుతోంది. 2026లో జరిగే టెస్ట్ సిరీస్‌లు భారత జట్టుకు పరీక్షగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనల్లో టెస్టులు ఆడనుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో 2025లో భారత్ ఆధిపత్యం చలాయించింది. చాంపియన్స్ ట్రోఫీ విజయంతో పాటు, టీ20లో నెంబర్ 1 జట్టుగా భారత్ నిలిచింది. కాగా, ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. టీం ఇండియా న్యూజిలాండ్‌తో భారత్ వన్డేలు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ పర్యటనలో మొత్తం 3 వన్డేలు, 5 టీ20లు జరుగుతాయి. ఇక.. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది.

Here is a detailed look at India s confirmed cricketing schedule for 2026

గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. మార్చి 8న ఫైనల్ (అహ్మదాబాద్) లో జరగనుంది. ఇక, మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 19వ సీజన్ జరగుతుంది. ఆ తరువా త భారత్ టీం అఫ్గానిస్థాన్‌తో భారత్ 1 టెస్టు, 3 వన్డేలు ఆడనుంది. ఈ టోర్నీల కోసం అఫ్గాన్​ భారత పర్యటనకు రానుంది. జులైలో ఇంగ్లండ్‌ పర్యటనకు టీమ్​ఇండియా వెళ్లనుంది. జులై 1 నుంచి జులై 11 వర కు 5 టీ20ల సిరీస్, జులై 14 నుంచి జులై 19 వరకు 3 వన్డేల సిరీస్ టీం ​ఇండియా ఆడనుంది. ఆగస్టులో శ్రీలంక పర్యటన (2 టెస్టులు), సెప్టెంబర్ లో అఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ (3 టీ20లు) సెప్టెంబర్ - అక్టోబర్ లో వెస్టిండీస్ పర్యటన (భారత్‌లో) - 3 వన్డేలు, 5 టీ20లు ఆడాల్సి ఉంది. ఇక.. అక్టోబర్ - నవంబర్: న్యూజిలాండ్ పర్యటన (న్యూజిలాండ్‌లో) - 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.

డిసెంబర్ లో శ్రీలంక పర్యటన (భారత్‌లో) - 3 వన్డేలు, 3 టీ20లు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి.
ఇక, రోహిత్ - కోహ్లీ ఈ ఏడాది 18 వన్డేలు ఆడనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌‌లో ఆడనున్నారు. వీరిద్దరు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినందున వన్డేల్లోనే ఆడతారు. కాగా, 2026లో ఈ ఇద్దరు 12 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడనున్నారు. అయితే 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.ఈ ఇద్దరు ఆడే మ్యాచ్ ల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. 2027 ప్రపంచ కప్ ముందస్తుగా ఈ ఏడాది జరిగే అన్ని టోర్నీలు టీమిండియాకు కీలకంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+