ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ .. భారత్ ఆటగాళ్లు వీళ్లే

గత సంవత్సర కాలంగా క్రికెట్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 11 మంది ఆటగాళ్ల లిస్టును ఐసీసీ ప్రకటించింది. టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అనే పేరుతో జాబితాను విడుదల చేసింది ఐసీసీ. అయితే ఆ లిస్టులో టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ కు చోటు దక్కింది. టీమ్ ఇండియా స్టార్ పేసర్, వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ బ్యాట్స్ మెన్ యశస్వీ జైశ్వాల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్క్వాడ్ లో ఉన్నారు. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు.

చరిత్ర సృష్టించిన బుమ్రా..

గతేడాది జరిగిన మొత్తం 13 టెస్టుల్లో బుమ్రా ఏకంగా 71 వికెట్లు సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లోనూ 9 ఇన్నింగ్స్ ఆడిన బుమ్రా 32సార్లు బ్యాట్స్ మెన్ ను ఔట్ చేశాడు. ఈ టెస్టు సిరీస్ లో అతని సగటు 13.06గా ఉంది. బౌలింగ్ తోపాటు కెప్టెన్సీలోనూ బుమ్రా సత్తా చాటాడు. దీంతో ఆసీస్ తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా ఇది భారత్ కు అతిపెద్ద విజయం.

ICC Announces Test Team of the Year Bumrah Jaishwal and Jadeja Represent India

యంగ్ బ్లాస్టర్ జైశ్వాల్..

టీమిండియా యంగ్ బ్యాట్స్ మెన్ యశస్వీ జైశ్వాల్ గతేడాది మొత్తం 15 మ్యాచ్ లు ఆడి 1478 పరుగులు రాబట్టాడు. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో జైశ్వాల్ మొత్తం 712 పరుగులు చేశాడు. పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో 161 పరుగులు చేయడం ఎప్పటికీ మరచిపోలేని ఇన్నింగ్స్. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలోనూ జైశ్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ మాత్రమే జైశ్వాల్ కంటే ముందు వరుసలో ఉన్నాడు. రూట్ 17 మ్యాచ్ లు ఆడి 1556 పరుగులు చేశాడు. రూట్ తో పాటు మరో ఇంగ్లాండ్ ఆటగాడు హారీ బ్రూక్(1100) కూడా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్ లో చోటు దక్కింది.

జడ్డూ.. మరోసారి ..

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్ లో నిలిచాడు. 2024లో 527 పరుగులు చేసిన జడేజా.. 48 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్ లో అతని సగటు 29.27 ఉండగా.. బౌలింగ్ లో మాత్రం 24.29 గా ఉంది. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.

ఐసీసీ టెస్ట్ టీమ్ ఇదే

యశస్వీ జైశ్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లాండ్), కేన్ విలియమ్ సన్(న్యూజిలాండ్), జో రూట్( ఇంగ్లాండ్), హారీ బ్రూక్(ఇంగ్లాండ్), కమిందు మెండిస్(శ్రీలంక), జమీ స్మిత్(వికెట్ కీపర్)(ఇంగ్లాండ్), రవీంద్ర జడేజా(భారత్), పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)(కెప్టెన్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రిత్ బుమ్రా(భారత్)... అయితే 2024 వన్డే జట్టుకు సంబంధించి ప్రకటించిన స్వ్కాడ్​లో ఒక్క టీమ్ఇండియా ప్లేయర్ లేకపోవడం గమనార్హం. గతేడాది భారత్ అతి తక్కువ వన్డే మ్యాచ్​లే ఆడడం దీనికి కారణంగా చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+