వరల్డ్ కప్ హీరోలకే మొండిచేయి.. ఫ్యాన్స్ ఫైర్!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినేషన్ల జాబితా ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా(14 వికెట్లు), బ్యాటింగ్ విభాగంలో సంజూ శాంసన్ నిలకడగా రాణించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు ఆటగాళ్లకు అవార్డు నామినేషన్ల జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్రకటించిన 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' నామినేషన్లలో వీరిద్దరి పేర్లు లేకపోవడం భారత అభిమానులను నిరాశపరిచింది.

నామినేషన్లలో ఉన్నదెవరంటే?
ఐసీసీ ఈ అవార్డు కోసం పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌లను నామినేట్ చేసింది.

సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్): టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సూపర్-8 దశతోనే నిష్క్రమించినప్పటికీ.. సాహిబ్దాదా ఫర్హాన్ ఆటతీరు మెరుగ్గా ఉంది. ఫర్హాన్ 6 మ్యాచ్‌లలో 2 సెంచరీలతో కలిపి 383 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ICC Player of the Month Nominations Spark Debate as Jasprit Bumrah Sanju Samson Miss Out

విల్ జాక్స్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ చేరుకోవడంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. విల్ జాక్స్ 8 మ్యాచ్‌లలో 226 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభ చాటాడు. టోర్నీలో 4 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు.

షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (అమెరికా): అమెరికా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగినప్పటికీ.. ఈ 37 ఏళ్ల పేసర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత్, పాకిస్థాన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన షాడ్లీ వాన్ షాల్క్‌విక్.. 4 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టి టోర్నీలో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

చర్చనీయాంశంగా మారిన ఎంపిక
జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ తలా 14 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. బుమ్రా మెరుగైన ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆటతీరు కనబరిచిన జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టడం వెనుక ఐసీసీ ఏ ప్రాతిపదికన నామినేషన్లు ఎంపిక చేసిందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయినప్పటికీ.. ఆ జట్టుకు చెందిన ఆటగాడికి నామినేషన్ దక్కడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+