Worldcup Fake Tickets : ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ కు ఫేక్ టికెట్ల దెబ్బ ! సోషల్ మీడియాలో..

క్రికెట్ ను అమితంగా ప్రేమించే భారత్ వంటి దేశాల్లో వరల్డ్ కప్ జరుగుతోందంటే పెద్ద పండగే. ఇప్పుడు ఆ పండగను సొమ్ము చేసుకునేందుకు క్రికెట్ బోర్డుల దగ్గరి నుంచి స్టేడియాల దగ్గర బటానీలు అమ్ముకునే వారి వరకూ ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో క్రికెట్ అభిమానులకు టికెట్ల డిమాండ్ పెరగడంతో నకిలీ టికెట్లు అమ్ముకునే వాళ్లు కూడా ఎక్కువయ్యారు. అదీ సోషల్ మీడియాలో స్మార్ట్ గా అమ్మేస్తుంటే అసలేదో, నకిలీ ఏదో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.

రేపు లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ ఫామ్ దృష్ట్యా చూసుకుంటే అభిమానులకు ఈ మ్యాచ్ పండగే. అదీ ఆదివారం కావడంతో లక్నోతో పాటు ఇతర నగరాల నుంచి తరలివస్తున్న అభిమానులు ఈ మ్యాచ్ ఎలాగైనా చూడాలన్న కసిగా ఉన్నారు. దీంతో ముందుగానే టికెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి నిమిషంలో టికెట్లు ఎలాగో దొరకవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టికెట్లు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.

Icc World Cup 2023: Fake tickets business in social media ahead of india-england clash,

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఎక్స్, ఫేస్ బుక్ లో ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ టికెట్లు వేర్వేరు పోస్టుల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టుల్లో ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ టికెట్ ఒకటి ఉంది, ఫ్రెండ్ చివరి నిమిషంలో హ్యాండిచ్చాడు, ఎక్స్ ట్రా టికెట్ ఉంది కావాలా ఇలా పోస్టులు పెడుతున్నారు. ఒక్కో టికెట్ 4500 ఉంది. నాలుగు టికెట్లు తీసుకుంటే 20 వేలకే ఇస్తాం, మంచి డీల్ అంటూ మరొకరు పోస్టులు చేస్తున్నారు. ఆయా టికెట్ల ఫొటోలు కూడా పెడుతున్నారు.

అలాగే ఈ టికెట్లు కావాలంటే ముందుగా టోకెన్ పేమెంట్ చేయమని యూపీఏ నంబర్లు కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఎలాగైనా మ్యాచ్ చూడాలని అనుకుని టికెట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు డబ్బులు పంపి మోసపోతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అచ్చు ఒరిజినల్ టికెట్ల లాంటివే అంటగట్టి మోసాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో అభిమానుల ఆసక్తిని వాడుకుని డబ్బులు దండుకునే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ కప్ నిర్వాహకులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+