ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలా జరిగితే పాకిస్తాన్ కి సెమీస్ ఛాన్స్ ఉన్నట్టే...?

పాకిస్తాన్ క్రికెట్ టీం పరిస్థితి చూస్తే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. దాదాపు 29 ఏళ్ల త‌ర్వాత పాకిస్థాన్‌ ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగింది. కానీ ఆతిధ్య జట్టు పాకిస్థాన్‌కు మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. గ్రూప్‌-ఎలో ఉన్న పాక్.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తయింది.

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓడిపోవడంతో.. టీంకు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్నారు. దీంతో దాదాపుగా పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లేనని చర్చ జరుగుతోంది.అయితే ఎక్కడో పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఎక్కడో చిన్న ఆశ మాత్రం పెట్టుకున్నారు. ఈ రకంగా జరిగితే తమ జట్టు సెమీస్ కి వెళ్లే ఛాన్స్ ఉంది అంటూ చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం..

If this happens in the Champions Trophy Pakistan has a chance of semis

పాక్ సెమీస్ చేరాలంటే..

నేడు జరగనున్న బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో కివీస్‌ ఓటమి పాలవ్వాలి. అలానే ఈ నెల 27న బంగ్లాదేశ్ తో జ‌రిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో జ‌రిగే పోరులో భార‌త్ విజ‌యం సాధించాలి. అప్పుడు గ్రూప్‌-ఏలో టీమిండియా 6 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంటుంది. ఇక మిగిలిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చెరో 2 పాయింట్ల‌తో స‌మానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ ర‌న్‌రేట్ ఉన్న టీమ్.. భార‌త్‌తో పాటు సెమీస్‌కు చేరుతుంది.

దీంతో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్ ఓడిపోయిన మ్యాచ్ లు భారీ రన్ రేట్ తేడాతో ఓడిపోవడమే కాకుండా.. పాకిస్తాన్ సైతం భారీ రన్ రేట్ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ రకంగా జరిగి పాకిస్తాన్ సెమీస్ చేరుతుందా.. లేదా నేడు జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించి పాక్ ఆశలు ఆవిరి చేస్తుందా అని చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+