రోహిత్, కోహ్లీపై వేటు?: కత్తి నూరుతున్న హేటర్స్
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. ఆ జట్టు నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించడంలో తడబడుతోంది. లంచ్ సమయానికి ఏకంగా సగం జట్టు అవుట్ అయింది. ఆరుమంది బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 55 పరుగులు అవసరం. నాలుగు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి.
ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ చివరి టెస్ట్‌లో నెగ్గితే గానీ టీమిండియా.. వైట్ వాష్ నుంచి తప్పించుకోలేదు. క్లీన్ స్వీప్ బారిన పడకుండా ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇలాంటి గేమ్‌లో బ్యాటర్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్ల ప్రతాపానికి దాసోహం అయ్యారు.

ఈ ఉదయం నుంచి వికెట్లు ఒకదాని వెంట ఒకటి వరుస కట్టాయి. ఎక్కడే గానీ భారీ భాగస్వామ్యం నెలకొనలేదు. ఒక దశలో 29 పరుగులకే అయిదుమంది కొమ్ములు తిరిగిన బ్యాటర్లు అవుట్ అయ్యారు. ఆ సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ కొంత ప్రతిఘటించారు. బ్యాటింగ్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజా అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పినట్టయింది. ప్రస్తుతం క్రీజ్‌లో రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో కూడా కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్‌లో 18 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్‌లో 11 రన్లకే పరిమితం అయ్యాడు. నేడు టీమిండియా కోల్పోయిన మొట్టమొదటి వికెట్ అతనిదే.
మాట్ హెన్రీ వేసిన బంతిని షాట్ ఆడాడు రోహిత్. మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని గ్లెన్ ఫిలిప్స్ వెనక్కి పరుగెత్తుతూ అద్భుతంగా అందుకున్నాడు. దీనితో 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత్. ఆ తరువాత వరుసగా అవుట్ అయ్యారు బ్యాటర్లు.
యశస్వి జైస్వాల్- 5, శుభ్‌మన్ గిల్- 1, విరాట్ కోహ్లీ- 1, సర్ఫరాజ్ ఖాన్- 1, రవీంద్ర జడేజా- 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భోజన విరామ సమయానికి రిషభ్ పంత్- 53, వాషింగ్టన్ సుందర్- 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కుదురుకుంటే గెలవడం కష్టమేమీ కాదు గానీ బౌలర్లు చెలరేగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం హేటర్స్‌కు పెట్టింది. రిటైర్మెంట్ ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. సోషల్ మీడియాలో వారిద్దరికీ వ్యతిరేకంగా వేలసంఖ్యలో ట్వీట్లు పడుతున్నాయి. దీని దెబ్బకు Retire అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ విఫలం కావడం జట్టు పరాజయాలకు కారణమైందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.












Click it and Unblock the Notifications