IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉండటంతో నేడు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. అయితే బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ టాస్ పడటంలో ఆలస్యమవుతోంది. వర్షం తగ్గగానే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం చాలాసేపు పడితే అంపైర్లు ఓవర్లను తగ్గించే అవకాశం ఉంది.

వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!
వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!

ఈ సిరీస్ అంతటా బ్యాటర్ల ఆధిపత్యమే కనిపిస్తోంది. లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు 200లకు పైగా పరుగులు సాధించాయి. రెండు సార్లు స్కోరు 250 దాటడం విశేషం. భారత్ తరఫున కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4 మ్యాచుల్లో 214.86 స్ట్రైక్ రేట్‌తో 159 పరుగులు చేయగా.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 4 మ్యాచుల్లో 190.51 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. బౌలింగ్ విభాగంలో ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ 6 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టాడు.

IND vs WI 5th T20 Rain Delays Toss in Bengaluru Decider Vaibhav Sooryavanshi Entrance Expected Full Details
IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!
IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!

హెడ్-టు-హెడ్ గణాంకాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 టీ20 మ్యాచులు జరగగా.. భారత్ 22 మ్యాచుల్లో గెలుపొందింది. వెస్టిండీస్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. రికార్డుల పరంగా భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత సిరీస్‌లో వెస్టిండీస్ గట్టి పోటీనిస్తోంది. ఇక బెంగళూరు చిన్న‌స్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+