సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరు.. కానీ..
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. అయితే రూ. 50 వేల పీస్ బాండ్ పై సంతకం చేసిన తర్వాతే దీప్కే విడుదల అవుతారని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని కొన్నాట్ ప్లేస్ లో సీజేపీ చేపట్టిన తిరంగా మార్చ్ లో పాల్గొనేందుకు అభిజిత్ దిప్కే వెళ్తున్న క్రమంలో అతడ్ని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
#WATCH | Delhi: CJP founder Abhijeet Dipke arrives at the residence of NCP-SCP spokesperson Anish GawandeDipke was released from Mandir Marg Police Station after he was granted bail https://t.co/HsGXDWRYhw
— ANI (@ANI) October 17, 2026
ఇక దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. రిలీజ్ అనంతరం తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో కీలక పోస్టు పెట్టారు అభిజిత్ దిప్కే. 2004 లో విడుదలైన షారుఖ్ ఖాన్ మూవీ వీర్ జారా నుంచి పాకిస్థానీ జైలు నుంచి 22 సంవత్సరాల తర్వాత విడుదలైన షారుఖ్ ఖాన్ ను గుర్తు చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చారు అభిజిత్ దిప్కే.. 24 గంటలపాటు వైఫై అలాగే ఫోన్ లేకుండా జైలు నుంచి బయటకు రావడం ఎలా ఉంటుంది..? అని రాసుకొచ్చారు.

అయితే తిరంగా మార్చ్ నిరసనల్లో భాగంగా అభిజిత్ దిప్కేతోపాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేహా బోరా కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఆయన శనివారం ఉదయం రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత దిప్కేను దిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద పోలీసులు హాజరుపరిచారు. ఇక దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దిప్కే ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ మేరకు దిప్కేను తక్షణమే రిలీజ్ చేయాలని కోర్టును ఆమె కోరారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న దిల్లీ హైకోర్టు దిప్కేకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సీజేపీ నేతలు అషుతోష్ రాంగా, సౌరభ్ దాస్ లు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications
