పాక్ తో సెమీస్ బాయ్ కాట్..! ఫైనల్ కొచ్చినా ..! టీమిండియా షాకులు..!

కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా క్షీణించాయి. ఆపరేషన్ సింధూర్ జోరుగా కొనసాగుతున్న సమయంలో సీజ్ పైర్ ప్రకటించి చర్చలు జరిపినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది.ఇందులో క్రీడారంగం కూడా మినహాయింపు కాదు. ఇదే క్రమంలో లండన్ లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో మన వెటరన్ ఆటగాళ్లు పాకిస్తాన్ తో మ్యాచ్ లను వరుసగా బహిష్కరిస్తున్నారు.

పాకిస్తాన్‌తో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సెమీఫైనల్‌లో ఆడకూడదని ఇండియా ఛాంపియన్స్ నిర్ణయించినట్లు టీమ్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌ను కూడా బహిష్కరించిన నిర్ణయానికి ఇక్కడా కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పియూష్ చావ్లా వంటి ఆటగాళ్ళు ఇండియా ఛాంపియన్స్ టీమ్ లో ఉన్నారు. వీరంతా మూకుమ్మడిగా మ్యాచ్ ల్ని బహిష్కరించారు.

india champions refuses to play with Pakistan in WCL 2025 semis amid Asia Cup match turmoil

తొలుత వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ లీగ్ దశలో పాకిస్తాన్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించింది. ఈ మ్యాచ్ ఆడబోమంటూ చివరి నిమిషంలో భారత ఆటగాళ్లు చెప్పేయడంతో పాక్ కు వాకోవర్ లభించింది. మిగిలిన మ్యాచ్ ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ సెమీక్ కు చేరుకుంది. ఇప్పుడు ఇతర మ్యాచ్ లు గెలిచి సెమీస్ కు చేరిన పాకిస్తాన్ తో ఆడేది లేదని మరోసారి టీమిండియా వెటరన్లు తేల్చిచెప్పేశారు. దీంతో పాకిస్తాన్ మరోసారి వాకోవర్ తో ఫైనల్ కు చేరబోతోంది. అయితే ఈ టోర్నీ ఫైనల్లో సైతం పాకిస్తాన్ తో ఆడేది లేదని ఇప్పటికే టీమిండియా వెటరన్లు తేల్చి చెప్పేస్తున్నారు.

ఇప్పటికే లీగ్, సెమీస్ మ్యాచ్ ల్లో ఆడకుండా పాకిస్తాన్ కు భారీ షాకులు ఇచ్చిన ఇండియా ఛాంపియన్స్ ఇప్పుడు ఫైనల్ ను కూడా బహిష్కరిస్తే అది పెను సంచలనమే కానుంది. తాజాగా తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను కేవలం 13.2 ఓవర్లలో ఓడించి ఇండియా ఛాంపియన్స్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అక్కడ పాక్ తో మ్యాచ్ కు నిరాకరించింది.

india champions refuses to play with Pakistan in WCL 2025 semis amid Asia Cup match turmoil

మరోవైపు ఆసియా కప్ టోర్నీలోనూ పాకిస్తాన్ తో టీమిండియా ఆడొద్దంటూ దేశంలో నిరసనలుమొదలయ్యాయి. అయితే ఈ టోర్నీ ఆతిధ్య దేశమైన భారత్ .. ఇలా పర్యాటక దేశంతో మ్యాచ్ ఆడకుండా వదిలేసే పరిస్ధితి లేదు. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్ ఆడాలని నిర్ణయించింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ లో వరుస మ్యాచ్ ల్ని ఇండియా ఛాంపియన్స్ బహిష్కరిస్తున్న తరుణంలో ఆసియా కప్ లో ఆడొద్దనే డిమాండ్లు మరింత పెరగబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+