బాబూ.. నీ బౌలింగ్ కో దండం..! బుమ్రాకు నో చెప్పేసిన యువీ..!

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో భారత జట్టు సాధిస్తున్న అప్రతిహత విజయాల్లో కీలకంగా ఉన్న ఆటగాళ్లలో పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముందంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బౌలర్లు ఉన్నా బుమ్రా స్ధానం ప్రత్యేకం. అతని స్వింగ్, యార్కర్లు, బౌన్సర్లు కలగలిపిన బౌలింగ్ ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ స్ధాయి బ్యాట్స్ మెన్ కూడా గడగడలాడుతున్నారు. అయితే బుమ్రా 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులో కీలకంగా ఉన్న యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ను భయపెట్టాడంటే నమ్మగలరా ?

ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్‌గా ఎదగడానికి చాలా కాలం ముందు, 16 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా తన సహజసిద్దమైన వేగం, మోసపూరిత బౌన్స్‌తో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ గా ఉన్న యువరాజ్ సింగ్‌ను ఇబ్బంది పెట్టాడట. అప్పట్లో యువరాజ్ సింగ్ క్యాన్సర్ కు గురై కోలుకుంటున్న సమయంలో నెట్స్‌లో బుమ్రాను ఎదుర్కొన్నాడు. అప్పట్లో ఇంకా చురుగ్గా ఉన్న బుమ్రా వేసే బంతుల్ని ఎదుర్కోలేక యువరాజ్ సింగ్.. ఆ యువకుడిని బౌలింగ్ ఆపమని చెప్పేశాడట.

India Legend Yuvraj Singh Recalls Facing Jasprit Bumrah s Rapid Pace Kid Stop Whoever You Are

తాను క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు బుమ్రాకు 16 ఏళ్లని, అతను నెట్స్‌లో చాలా వేగంగా బౌలింగ్ చేస్తున్నానని యువరాజ్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పుడే క్యాన్సర్ నుండి కోలుకుని క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ కుర్రాడు నెట్స్‌లోంచి బయటకు వెళ్లాలని, తనకు బౌలింగ్ చేయడం ఆపమని కోరినట్లు యువీ తెలిపాడు. ఈ కుర్రాడు చాలా ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు, నేను బాబూ, ఆపు నువ్వెవరో గానీ!' అన్నానని యువీ గుర్తుచేసుకున్నాడు.అప్పట్లో బుమ్రాకు చాలా లాంగ్ రనప్ ఉండేదని, పెద్దగా నైపుణ్యాలు లేవని, కానీ చాలా వేగంగా బౌలింగ్ చేసేవాడని యువీ వెల్లడించాడు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయ్యాడని ప్రశంసించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+