అంత సీన్ ఉందనుకుంటే నీళ్లు మోసేందుకే పరిమితం చేశారు: జపాన్ కెప్టెన్ సెటైర్!

జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంపై జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ నిరాశను వ్యక్తం చేశారు. భారత్, జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు సంకేతంగా జరిగిన ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆటను స్టేడియంలో నేరుగా చూడాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని.. కానీ అతనికి అవకాశం లభించకపోవడం కొంచెం బాధ కలిగించిందని మ్యాచ్ అనంతరం జపాన్ కెప్టెన్ పేర్కొన్నారు.

IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!
IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!

గత ఏడాదిన్నర కాలంలో తన అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఈ మ్యాచ్ కంటే ముందే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లకు 5 ఓవర్లకు కుదించారు. కేవలం 30 బంతుల పోటీ మాత్రమే కావడంతో భారత యాజమాన్యం అనుభవం ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో వైభవ్ సూర్యవంశీని బెంచ్ కే పరిమితం చేయాల్సి వచ్చింది.

India vs Japan T20 Japan Captain Kadowaki-Fleming Disappointed over Vaibhav Sooryavanshi Exclusion

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ స్పిన్నర్ చార్లీ హెరా హింజీ ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మను ఔట్ చేసి షాకివ్వగా.. సంజు శాంసన్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. భారత బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో మ్యాచ్ చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది.

 క్లైమాక్స్‌లో అదిరింది!: భారత్ పక్కన మెడల్ సెల్ఫీకి పాకిస్తాన్ రెడీ!!
క్లైమాక్స్‌లో అదిరింది!: భారత్ పక్కన మెడల్ సెల్ఫీకి పాకిస్తాన్ రెడీ!!

33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్, భారత బౌలర్లకు గట్టి పోటీ ఇచ్చింది. జపాన్ కెప్టెన్ కడోవాకి-ఫ్లెమింగ్ 12 పరుగులతో పోరాడినప్పటికీ నాలుగో ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో జపాన్ గెలుపునకు 8 పరుగులు అవసరం కాగా.. అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు చివరి బంతికి 4 పరుగులు కావాల్సిన దశలో ఓ పరుగు మాత్రమే రావడంతో భారత్ 2 పరుగుల స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+