ఆసియన్ గేమ్స్‌లో తొలి స్వర్ణం కైవసం చేసుకున్న భారత్..
ఆసియన్ గేమ్స్ 2023 చైనా వేదికగా జరుగుతున్నసంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్‌తో తన ఖాతాను తెరిచింది. మన షూటర్లు అదరగొట్టారు. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ రావడం దేశం గర్వించదగ్గ విషయం. భారత్ కు మొట్టమొదటి బంగారు పతకాన్ని రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ లతో కూడిన జట్టు సాధించింది. అంతేకాదు వరల్డ్ రికార్డుతో ఈ గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈ ముగ్గురూ ఏకంగా 1893.7 పాయింట్లతో క్వాలిఫికేషన్ రౌండ్లోనే వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు.
తొలిపతకం షూటర్ల కైవసం..:ఆసియా పోటీల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తొలి రోజు ఆదివారం భారత్‌కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి. మరుసటి రోజు పది మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానంలో ఉండగా, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. .

రజత పతకంతో మహిళల రైఫిల్ టీమ్..:మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రమిత జిందాల్, మెహులీ ఘోష్, ఆషి చోక్సీలతో కూడిన జట్టు రజత పతకం సాధించింది. 1886 పాయింట్ల స్కోరుతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక ఇప్పుడు పురుషుల ఈవెంట్లో ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ గెలవడం ఇండియా గర్వించదగ్గ విషయం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత 631.9, మెహులీ 630.8, చోక్సీ 623.3 పాయింట్లు స్కోరు చేసి, ఓవరాల్‌గా రెండో స్థానంతో పతకం దక్కించుకున్నారు. 1896.60 పాయింట్లతో స్వర్ణం నెగ్గిన చైనా టీమ్. మంగోలియా కాంస్యం దక్కించుకొంది.
చైనా రికార్డు బ్రేక్ చేసింది..:ఈ ఏడాది మొదట్లో బాకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో చైనా సెట్ చేసిన రికార్డును రుద్రాంక్ష్ జట్టు బ్రేక్ చేసింది. ఫైనల్లో ఇండియన్ షూటర్లు కాస్త నెమ్మదిగానే మొదలుపెట్టారు. తొలి సిరీస్ లో రుద్రాంక్ష్, దివ్యాన్ష్ చెరో 104.8 పాయింట్లు, ఐశ్వరి 104.1 పాయింట్లు సాధించారు. అయితే తర్వాత సిరీస్ వేగంగా పుంజుకోవడం మొదలుపెట్టారు. ఆరో సిరీస్‌కే ఏకంగా వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు ఇండియన్ షూటర్లు. ఈసారి ఏషియన్ గేమ్స్ లో 100 మెడల్స్ రికార్డు బ్రేక్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగింది ఇండియా. ఇప్పటికే మూడు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఇండియా సొంతమయ్యాయి.












Click it and Unblock the Notifications