ఆసియా కప్ భారత జట్టు ఇదే..టీంలోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..!
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ మొదలు కానుంది.
జట్టు ఎంపికలో కీలకాంశాలు
సెలెక్టర్లు ఊహించినట్లుగానే పెద్దగా మార్పులు లేకుండా యువ ఆటగాళ్లనే కొనసాగించారు. అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.శుభ్‌మన్ గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు, అతను సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.గాయం నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు ఈ టోర్నీలో చోటు దక్కలేదు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు బ్యాకప్‌గా జితేష్ శర్మ ఎంపికయ్యారు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే జట్టులో ఉన్నారు.స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను కొనసాగించారు.హర్షిత్ రాణా మూడో పేసర్‌గా జట్టులో చేరాడు. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు.

ఆసియా కప్ 2025 - భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
హార్దిక్ పాండ్యా
సంజు శాంసన్
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ
జితేష్ శర్మ
రింకూ సింగ్
అక్షర్ పటేల్
శివమ్ దూబే
హర్షిత్ రాణా
జస్‌ప్రీత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్
వరుణ్ చక్రవర్తి
భారత్ మ్యాచ్ షెడ్యూల్
సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎలో ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. మరి ఈ యువ జట్టు ఆసియా కప్‌ను గెలుచుకుంటుందా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications