T20 WorldCup 2024: టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ఖరారు ? జాబితాలో వీరే..
ఈ ఏడాది జూన్ లో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024కు ముందే టీ20 వరల్డ్ కప్ కోసం దాదాపు 10 పేర్లు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మిగతా పేర్లు కూడా ఖరారైనట్లు సమాచారం. ఈసారి ప్రపంచ కప్ వెస్టిండీస్, అమెరికా జరుగుతున్నందున టీమిండియా జంబో టీమ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆడిన భారత జట్టులో కనీసం ఏడుగురు ఆటగాళ్లను ఈసారి వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2022 వరల్డ్ కప్ లో ఆడిన భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ , మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ ఉన్నారు. వీరిలో ఏడుగురికి ఈసారి ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.

దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లు ఈసారి పోటీలోనే లేరు. కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో రవిచంద్రన్ అశ్విన్ సీటుకు కూడా ముప్పు ఉంది. 2022లో రవీంద్ర జడేజా పోటీ నుంచి తప్పుకోవడంతో అతని స్ధానంలో అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. ఈసారి జడేజా ఫిట్‌గా ఉన్నప్పటికీ ఎంపిక కష్టమే. ఇప్పటివరకూ ఒక్క టీ20 వరల్డ్ కప్ ఆడకపోయినా నిలకడగా రాణిస్తున్న చాహల్ కూడా పోటీలో ఉన్నాడు.పేసర్లలో షమీ గాయంతో దూరమయ్యాడు.
2022 వరల్డ్ కప్ లో ఆడిన దినేష్ కార్తీక్ ఈసారి ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నా అతని కంటే శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూసింగ్ వంటి ఫినిషర్లపై, సంజూ శాంసన్ వంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ వైపు బీసీసీఐ మొగ్గు చూపే అవకాశముంది.తాజా అంచనాలను బట్టి చూస్తే ఈసారి రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్, సంజూ శాంసన్ (కీపర్), శుభమన్ గిల్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications