IPL 2024: ముంబై కెప్టెన్ గా ఆ స్టార్ బౌలర్ ? హార్ధిక్ పై వేటుకు రెడీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో మొదలుపెట్టింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టోర్నీ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత టీమ్ లో ఏదో వెలితి కనిపిస్తోంది. అదే సమయంలో వరుస పరాజయాలతో టోర్నీ ఆరంభించడంతో హార్ధిక్ కెప్టెన్సీ మార్పుకు ఒత్తిడి పెరుగుతోంది.
ఈసారి ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. కేవలం 6 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ పోగొట్టుకుంది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన రెండో మ్యాచ్ లో సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది. దీంతో సన్ రైజర్స్ ఏకంగా 277 పరుగులు చేసి ఐపీఎల్ రికార్డుల్ని తిరగరాసింది. అయితే సన్ రైజర్స్ కు పోటీగా లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించినా ముంబై మాత్రం 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడినట్లయింది. అదే సమయంలో కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగానూ హార్ధిక్ విఫలమయ్యాడు.

దీంతో హార్ధిక్ పాండ్యాను తప్పించాలనే డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హార్దిక్ తో పాటు ముంబై ఇండియన్స్ కు ట్రోలింగ్ పెరుగుతోంది. దీంతో ముంబై మేనేజ్ మెంట్ హార్దిక్ ను సాధ్యమైనంత త్వరగా తప్పించి ఆ స్ధానంలో స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తోంది. అయితే ముంబై తర్వాతి మ్యాచ్ లోనే కెప్టెన్సీ మార్పు ఉంటుందా లేక మరో రెండు, మూడు మ్యాచ్ లు చూస్తారా అన్నది తెలియరాలేదు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications