IPL 2026 Final Prediction: ఐపీఎల్ ఫైనల్ విజేత వాళ్లే-తేల్చేసిన అశ్విన్..!
దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) తుది అంకానికి చేరుకుంది. ఇవాళ అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై ఇప్పటికే పలు జోస్యాలు, అంచనాలు వెలువడ్జాయి. ఇదే క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ ఫైనల్ విజేతపై తన అంచనా్ (IPL 2026 Final Prediction) చెప్పేశాడు.
రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఫైనల్‌ను గెలుస్తుందని బలంగా అంచనా వేస్తున్నారు. ఆర్సీబీ కేవలం సొంత తప్పిదాలు ఉంటే తప్ప ఇవాళ ఓడిపోదు. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ.. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో చిత్తు చేసి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ మరోసారి అదే జట్టుతో టైటిల్ పోరులో తలపడుతోంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆడటం గుజరాత్‌కు ఉన్న ప్రయోజనమని అంగీకరిస్తూనే... టోర్నమెంట్ మొత్తం ఆర్సీబీ ప్రదర్శన వారిని దుర్బేద్యంగా మార్చిందన్నాడు.

జీటీ తమ సొంత మైదానంలో ఆడటం, అక్కడ ఆధిపత్యం చెలాయించి దానిని ఒక దుర్భేద్యమైన కోటగా మార్చడం వంటి అంశాలు ఫైనల్‌కు వెళ్లే ముందు వారికి అదనపు ఉత్సాహాన్ని ఇస్తాయని రవిచంద్రన్ అశ్విన్ .. జియో హాట్‌స్టార్ కు తెలిపాడు.
ఆర్‌సిబికి మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పర్వాలేదని, ఈ ఫైనల్ వారిదేనన్నాడు. వారు ఫేవరెట్లుగానే బరిలోకి దిగుతున్నారన్నాడు. వారు ఏది చేసినా, ఈ సీజన్ మొత్తం ఆడిన దానికంటే ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు లేదా తక్కువ దూకుడుగా ఆడకూడదన్నాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ దూకుడు వైఖరికి అశ్విన్ మద్దతు తెలిపాడు.












Click it and Unblock the Notifications