IPL 2027: CSK, SRH మధ్య డీల్ ఖరారు- నలుగురు స్టార్లకు స్దానచలనం..!
వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ (IPL 2027) కోసం ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పులు, చేర్పులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు జట్లు తమ ఆటగాళ్లను ఇతర జట్లకు ఇచ్చి, కొత్త ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా దక్షిణాదికి చెందిన రెండు జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా పరస్పరం ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఇలా మొత్తం నలుగురు ఆటగాళ్లు తమ జట్లను మారి, కొత్త జట్లలో ఆడబోతున్నారు. ఈ మేరకు ఇరు జట్ల మధ్య డీల్ ఖరారైంది.
ఈ డీల్ ప్రకారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, ఆస్ట్రేలియా సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కేలో చేరనుండగా.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో చేరబోతున్నారు. లివింగ్ స్టోన్ తన సొంత జట్టు హైదరాబాద్ నుంచి చెన్నై కు 6 కోట్ల ప్యాకేజీకి వెళ్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ అతన్ని గతంలో 13 కోట్లకు కొనుక్కుంది. జాక్ ఎడ్వర్డ్స్ తన ప్రస్తుత 3 కోట్ల ప్యాకేజీకే చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తున్నాడు. గత సీజన్ కు 3 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ .. కాలి గాయం కారణంగా అతనికి మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వదిలేసింది.

వీరికి బదులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో తమ జట్టుకు ఆడిన ఖలీల్ అహ్మద్ ను 4.8 కోట్ల ప్యాకేజీకి కొనుక్కుంది. 2018 నుంచి 2021 వరకూ సన్ రైజర్స్ కు ఖలీల్ ఆడాడు. అలాగే సన్ రైజర్స్ ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ ను తన ప్రస్తుత 2 కోట్ల ప్యాకేజీనే కొనసాగిస్తూ తీసుకుంది. అతని టీ20 అనుభవం హైదరాబాద్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎల్లిస్ కూడా గాయం కారణగా గత సీజన్ కు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు అతన్ని చెన్నై హైదరాబాద్ కు ఇచ్చేసింది. తాజా మార్పులతో సీఎస్కేకు ఇద్దరు విదేశీ ఆల్ రౌండర్లు అందుబాటులోకి రానుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎల్లిస్, ఖలీల్ రూపంలో తన బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ 2027 నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














Click it and Unblock the Notifications
