కావ్యా పాప హార్ట్ బ్రేక్ చేసిన కీ ప్లేయర్
Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు సాగిందీ వేలం. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. తమకు కావాల్సిన గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసుకున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల ఓనర్లు, సీఈఓలు, హెడ్ కోచ్‌లు, కోచింగ్ స్టాఫ్ ఈ వేలానికి హాజరయ్యారు.

ఈ వేలంపాటలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను వదులుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. రెండో రోజు అతని పేరు వేలానికి రాగా.. మిగిలిన జట్లతో పోటీ పడలేకపోయింది. భువిని కొనుగోలు చేయలేకపోయింది. స్వింగ్ కింగ్‌గా పేరున్న భువనేశ్వర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎగరేసుకెళ్లింది. 10.75 కోట్లరూపాల భారీ ధరతో దక్కించుకుంది.
రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన భువి కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. ఆయా ఫ్రాంఛైజీల ఓనర్లు ఆకాశ్ అంబానీ, సంజీవ్ గోయెంకా భారీగా బిడ్స్ వేశారు. ఫలితంగా అతని ధర 10 కోట్ల రూపాయలను దాటింది.

10.50 కోట్ల రూపాయల వద్ద బిడ్డింగ్ రేసు నుంచి తప్పుకొంది ముంబై. దీనితో అతను తన హోమ్ స్టేట్ లక్నో సూపర్ జెయింట్స్ వెళ్లడం ఖాయమనుకునే లోపే ఆర్సీబీ ఎంట్రీ ఇచ్చింది. 10.75 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
2024 సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు భువనేశ్వర్ కుమార్. 176 మ్యాచ్‌లల్లో 181 వికెట్లు తీశాడు. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడీ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. అతణ్ని వదులుకున్నందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ రియాక్ట్ అయ్యారు. ఆవేదనను వ్యక్తం చేశారు. హార్ట్ బ్రేక్ సింబల్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications