Virat Kohli: ఎన్ని మిస్సవుతున్నామో ? కొహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ ట్వీట్ ..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఇవాళ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక కావడం కష్టమేనని భావించిన కొహ్లీ ఇవాళ రిటైర్మెంట్ ప్రకటన చేసేశాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో కీలక ప్రకటన చేశాడు. దీంతో కింగ్ కొహ్లీ అభిమానులు దీనిపై స్పందిస్తుందన్నారు. కొందరు కొహ్లీ ప్రకటనను స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం అప్పుడే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సింది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కొహ్లీ రిటైర్మెంట్ పై అతని ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ స్పందించింది.

విరాట్ కొహ్లీని అభిమానులు ఇన్నాళ్లూ మైదానంలో ఎలా చూడాలనుకున్నారో, ఇప్పుడు రిటైర్మెంట్ తో ఏం మిస్సవుతున్నారో నాలుగు ముక్కల్లో అభివర్ణిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్ మెంట్ ఇవాళ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ఇందులో "ఆ నడక, ఆ షాట్లు, ఆ హావభావాలు, ఆ సంబరాలు..మేం ఇవన్నీ మిస్సవుతున్నాం" అంటూ ఆర్సీబీ ఈ ట్వీట్ లో పేర్కొంది. తద్వారా తమ జట్టులో మేటి క్రికెటర్ టెస్టులకు ప్రకటించిన రిటైర్మెంట్ పై తమ అభిప్రాయాన్ని అంతే ఎమోషనల్ గా పంచుకుంది.

IPL royal challengers Bengaluru emotional tweet on virat kohli s retirement to tests

ఈ సందర్భంగా ఆర్సీబీ తన ట్వీట్ కు ఓ వీడియోను కూడా జత చేసింది. ఇందులో భారత్-ఆస్ట్రేలియాల మధ్య గతంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కొహ్లీ ఆడిన షాట్లు, అతని హావభావాలు, సొగసైన ఆటను గుర్తుచేసేలా ఉన్న వీడియోలను షేర్ చేసింది. అలాగే ఫీల్డింగ్ లోనూ కొహ్లీ చురుకుదనం, ఇతర ఆటగాళ్లతో వ్యవహరించే తీరు అన్నీ కలగలిపి ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియో కింగ్ కొహ్లీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టెస్టు క్రికెట్ లో మేటి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న కొహ్లీ భారత్ కు 68 టెస్టుల్లో నాయకత్వం వహించి ఏకంగా 40 టెస్టుల్ని గెలిపించాడు. ఇదో రికార్డు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+