ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరేదీ ఈ 4 జట్లే- టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ప్రిడిక్షన్స్

SRH vs LSG: ఐపీఎల్ మ్యాచ్‌లకు అర్థాన్నే మార్చివేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తన సొంత గడ్డ.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక.

తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై వీరవిహారం చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. తొలుత బ్యాటింగ్‌కు దిగి 286 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెంచరీతో రెచ్చిపోయాడు ఇషాన్ కిషన్. 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్.. ఇలా వచ్చిన వాళ్లందరూ ఉతికి ఆరేయడంతో ఆ స్కోర్ సాధ్యపడింది.

Irfan Pathan has picks these 4 teams to IPL 2025 playoffs

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. అద్భుతంగా పోరాడింది. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు కొట్టింది. సంజు శాంసన్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయిర్, శుభమ్ దుబే.. దుమ్ము దులిపారు. అదరగొట్టారు గానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన దూకుడును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. లక్నోసూపర్ జెయింట్స్‌పైనా ప్రతాపం చూపించాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌లో లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో చిత్తుగా ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. లక్నో నిర్దేశించిన 167 పరుగులను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కొట్టి అవతల పడేసింది సన్‌రైజర్స్.

ఈ వారంలో జరిగిన మ్యాచ్‌లల్లో కోల్‌కత నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కత నైట్ రైడర్స్ ఆ తరువాత గాడిన పడింది. తన రెండో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌లు ఆడినా ఇంకా బోణీ కొట్టట్లేదు రాజస్థాన్.

Take a Poll

తొలి వారంలోనే ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతున్న దశలో ఏఏ జట్లు ప్లేఆఫ్స్‌‌కు చేరుకుంటాయనే అంచనాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. కొందరు మాజీ క్రికెటర్లు, ఆల్ రౌండర్లు తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ప్లేఆఫ్స్‌పై అభిప్రాయాలను పంచుకుంటోన్నారు.

తాజాగా- టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరే జట్ల గురించి వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్.. ఈ నాలుగు జట్లే ప్లేఆఫ్స్ చేరుకుంటాయని కుండబద్దలు కొట్టాడు. ఈ లిస్ట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+