ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ: 27 ఫోర్లు- నాన్ స్టాప్ బ్యాటింగ్

దేశవాళీ క్రికెట్ చరిత్రలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కేప్టెన్ ఇషాన్ కిషన్ నూతన అధ్యాయాన్ని లిఖించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. అతని దెబ్బకు చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు మధ్యాహ్నానికి ఈస్ట్ జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది.

మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన తరుణంలో ప్రత్యర్థి బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్న వేళ ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన కిషన్, ఆ తర్వాత లంచ్ విరామం ముగిసిన వెంటనే గేర్ మార్చాడు. ఆట రెండో రోజు లంచ్ బ్రేక్ ముగిసిన కొద్దిసేపటికే కేవలం 270 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్.. ఇషాన్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ది బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Ishan Kishan Powered in Duleep Trophy Final Hits Double Century vs South Zone in Chennai Chepauk

సౌత్ జోన్ బౌలర్ల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. పేసర్ల బౌలింగ్‌లో డిఫెన్స్, అటాకింగ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో అతని పరిణతి స్పష్టంగా కనిపించింది. ఒత్తిడి సమయాల్లో సహచర బ్యాటర్లతో సమన్వయం చేసుకుంటూ భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

ఫస్ట్ క్లాస్ లో మాస్ బ్యాటింగ్: సెంచరీతో తడాఖా చూపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్
ఫస్ట్ క్లాస్ లో మాస్ బ్యాటింగ్: సెంచరీతో తడాఖా చూపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్

4 వికెట్ల నష్టానికి 385 పరుగులతో రెండో ఇన్నింగ్ ను ఆరంభించాడు ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్ర. తొలి రోజే అతని సెంచరీ పూర్తయిన విషయం తెలిసిందే. దీన్ని డబుల్స్ గా మలచుకోగలిగాడు. ఆరంభం నుంచే బౌలర్లపై వీరిద్దరూ విరుచుకుపడ్డారు. కుశాగ్ర సైతం సెంచరీ చేశాడు. 101 పరుగులు చేసిన అతను త్రిపురాన విజయ్ బౌలింగ్ లో చామా వీ మిళింద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే జట్టు స్కోరు 471 పరుగులకు చేరింది.

ఆ తర్వాత అనుకూల్ రాయ్ తో కలిసి దూకుడుగా ఆడాడు ఇషాన్ కిషన్. అదే ఊపులో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని ఇన్నింగ్ లో మొత్తం 27 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతను త్రిబుల్ సెంచరీ వైపుర దూసుకెళ్తోన్నాడు. 233 పరుగుల వద్ద ఆడుతున్నాడు. 34 పరుగులతో అనుకూల్ రాయ్ అతనికి చక్కటి సహకారాన్ని అందిస్తోన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+