"వైసీపీ ప్లాన్ ను లైట్ తీసుకోవద్దు"- నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఫీట్ ను రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పరిస్ధితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. ప్రభుత్వంలో ఉండటంతో వైసీపీ మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం ఉన్నా.. క్లీన్ స్వీప్ గ్యారంటీ లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు.

కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?

ఇందులో రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఫ్యాక్ట్ తో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఉగ్రవాదుల తరహాలో హిట్ -రన్ -హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులపై విమర్శలకు వైసీపీ సిద్ధంగా ఉంటోదన్నారు. గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంగా ఉన్నప్పటికీ, పనులు పూర్తి కాకపోయినా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ డ్రామాలాడారన్నారు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తే అది ఎప్పుడే పూర్తి చేసేశామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరసిస్తే గోదావరి జలాలు కావు పురుషోత్తపట్నం నుంచి వచ్చాయంటున్నారని తెలిపారు.

Chandrababu Alerts TDP Leaders to YSRCP Fake Propaganda Ahead of Local Body Polls
ఈవీఎంలా ? బ్యాలెట్ పేపర్లా ? ఏపీ స్ధానిక ఎన్నికల్లో ఈసీ ఛాయిస్ ఇదే..!
ఈవీఎంలా ? బ్యాలెట్ పేపర్లా ? ఏపీ స్ధానిక ఎన్నికల్లో ఈసీ ఛాయిస్ ఇదే..!

వైసీపీ చేస్తున్న వక్రీకరణలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని నేతల్ని కోరారు. ఏపీపీఎస్సీలో అడ్డగోలుగా అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు చూస్తారనే భయం వారిలో ఉందన్నారు. బయట కూర్చుని అదే పనిగా అబద్ధాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతల్ని కోరారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మరింతగా ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తామని, వారు కూడా అదేస్థాయిలో పనిచేయాలని అన్నారు. నాయకత్వాన్ని పెంచుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని పార్టీకి బలం చేకూర్చాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+