RK Roja స్ట్రాంగ్ వార్నింగ్! క్వారీ బాధితుల పక్షాన వైసీపీ పోరాటం..

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్‌ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు.

Former Minister RK Roja Slams MLA Gali Bhanu Prakash Over Illegal Quarrying in Cherlopalli Village
కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!
కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!

చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా
ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా

ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!

ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం క్వారీ యజమానులకు కొమ్ముకాయడం సరికాదని, చెర్లోపల్లి రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని, వారి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+