అసెంబ్లీ సాక్షిగా.. నా చీరెను లాగబోయారు: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కంటతడి

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న వేళ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలోకి వెళ్లకుండా వారిని ప్రధాన గేటు వద్దే నిలువరించారు. దీంతో అక్కడ భారీ స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది.

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా నల్ల టీషర్టులు ధరించి బయలుదేరింది. ఈ దుస్తులపై కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, నెరవేరని ఆరు గ్యారంటీలపై విమర్శనాత్మక నినాదాలు రాసి ఉన్నాయి. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులను గేటు వెలుపలే నిలిపివేశారు.

BRS MLA Sunitha Lakshma Reddy Alleged that Her Saree Pulled During Clash With Police in Heated Scuffle

పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ గేట్ నంబర్ 1 వెలుపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారి ఆందోళనలను నిలువరించడానికి పోలీసులు చివరికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. నిరసన తెలుపుతున్న కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు.

కేటీఆర్ తలకు గాయం- చిరిగిన హరీష్ షర్ట్: అసెంబ్లీ వద్ద రణరంగం: తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు
కేటీఆర్ తలకు గాయం- చిరిగిన హరీష్ షర్ట్: అసెంబ్లీ వద్ద రణరంగం: తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు

ఈ ప్రక్రియలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. తల, నుదురు, చేతికి గాయాలయ్యాయి. అదే సమయంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. తన చీరెను లాగబోయారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ మహిళా ప్రజాప్రతినిధికి ఇలాంటి అవమానం జరగడం అత్యంత దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యారంటీలకు టాటా, హామీలకు బైబై: అసెంబ్లీ సమావేశాల వేళ..
గ్యారంటీలకు టాటా, హామీలకు బైబై: అసెంబ్లీ సమావేశాల వేళ..

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానకర సంఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె మండిపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమెను ఓదార్చడం కనిపించింది. అక్కడే ఉన్న మహిళా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చీరెను ఎలా లాగుతారంటూ సునీత లక్ష్మారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి పోలీసులను నిలదీశారు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఒకరు క్షమాపణలు చెప్పారు. 'సారీ మేడమ్..' అంటూ తన తప్పును అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+