స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త కెప్టెన్, కావ్య తాజా నిర్ణయం వెనుక..!!

సన్​రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ రానున్నారు. 2026 టోర్నీలో రెండు అడుగుల దూరంలో టైటిల్ మిస్ చేసుకున్న సన్ రైజర్స్ వచ్చే 2027 టోర్నీ కోసం కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రస్తుత కెప్టెన్ కమ్మిన్స్ స్థానంలో కొత్త కెప్టెన్ పేరు దాదాపు ఖరారైంది. ఎలాగైనా 2027 టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో కీలక మార్పులకు టీం యాజమాన్యం రెడీ అయింది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం సర్ రైజర్స్ హైదరాబాద్ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. టీం కెప్టెన్ కమిన్స్​ ఆటపై జట్టుకు ఎలాంటి సందేహం లేదు. కానీ 2027లో యాషెస్ సిరీస్, ఆపై వన్డే వరల్డ్​కప్ నేపథ్యంలో అతడు ఐపీఎల్ కు అందుబాటులో ఉండనని ఇప్పటికే కమ్మిన్స్ స్వయంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో.. గత సీజన్ లోనూ కమ్మిన్స్ రాక ఆలస్యం కావటంతో.. తొలి విడత మ్యాచ్ లకు ఇషాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

Ishan Kishan will become Sunrisers Hyderabad s full-time captain in 2027 in place of pat cummins

దీంతో.. ఇప్పుడు వచ్చే సీజన్ కు పూర్తి కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అతడి సారథ్యంలో సన్​రైజర్స్​ 7 మ్యాచ్​లు ఆడింది. ఇందులో నాలుగింట్లో విజయం సాధించగా, మూడు మ్యాచ్​ లలొ ఓడింది. తన బ్యాటింగ్ తోనే కాకుండా కెప్టెన్​ గా ఇషాన్ పర్మినెంట్ కెప్టెన్ గా నాడే ఫిక్స్ అయ్యారు.

ప్యాట్ కమిన్స్ 2024లో​ సన్ రైజర్స్ లోకి వచ్చాడు. రావడంతోనే అతడిని మేనేజ్​మెంట్ కెప్టెన్​గా నియమించింది. దీంతో 2024 నుంచి సన్​రైజర్స్​లో భారీ మార్పు వచ్చింది. కమ్మిన్స్ కెప్టెన్సీ లో టీం ఎన్నో రికార్డుల మోత పుట్టించింది. 2025లో ఆరో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ 2026లో మూడో స్థానంతో ఆగిపోయింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో పాటుగా టీంను నడిపించిన తీరు గత సీజన్ లో స్పష్టమైంది. దీంతో.. జట్టులో ఒక దశలో సీనియర్లుగా ఉన్న మరో ఇద్దరి పేర్లను పరిశీలన చేసారు. అయితే, జట్టు యాజమాన్యం మాత్రం ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ విష‌యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ డిసెంబ‌ర్ లో అధికారికంగా ప్రకటన చేస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+