KKR vs RCB: ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌కు షాక్.. అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు!

KKR vs RCB: ఐపీఎల్ 18వ సీజన్ మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆర్సీబీ షాకిచ్చింది. మొదట అద్భుతంగా ఆడిన కేకేఆర్ బ్యాటర్లను అనంతరం ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలోసునీల్ నరైన్ ఓపెనర్‌గా 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, అజింక్య రహానె 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ 56 పరుగులు చేయగా, అంగ్క్రిష్ రఘువంశీ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరఫున కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్ ప్రారంభంలో ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్ కు ఆరంభంలో ఎదురుదెబ్బలు ఇచ్చింది. తొలి మూడు ఓవర్లలో కేకేఆర్ 9 పరుగులు మాత్రమే చేసి మొదటి వికెట్ ను కూడా కోల్పోయింది. అనంతరం సునీల్ నరైన్, అజింక్యా రహనే బాధ్యత తీసుకుని పరుగుల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి 103 పరుగుల భాగస్వామ్యంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగులు తీసింది. రహానే తన హాఫ్ సెంచరీతో బలమైన స్థితికి తీసుకెళ్లాడు.

KKR vs RCB IPL 2025 Opening Match - KKR Shaken RCB s Target Set

తడబడిన మిడిల్ ఆర్డర్
సునీల్ నరైన్ 9.6వ ఓవర్ లో 44 పరుగులకు ఔట్ అయిన తర్వాత కేకేఆర్ మిడిల్ ఆర్డర్ తడబడింది. ఆ తర్వాత వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జట్టు ఒత్తిడిలో పడింది. ఆండ్రీ రస్సెల్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. త్వరలోనే ఔట్ అయ్యాడు. కేకేఆఱ్ స్కోరు 107/1 నుండి 150/6గా మారింది. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్ కొన్ని మంచి షాట్లు ఆడారు కానీ వారు జట్టును పెద్ద స్కోరుకు తీసుకెళ్లలేకపోయారు. 19.5వ ఓవర్లో హర్షిత్ రాణా వికెట్ పడటంతో కేకేఆర్ కష్టాలు మరింత పెరిగాయి. చివరికి కేకేఆఱ్ 20 ఓవర్లలో 174/8 మాత్రమే చేయగలిగింది.

రాణించిన ఆర్సీబీ బౌలర్లు
ఆర్సీబీ తరఫున జోష్ హేజిల్ వుడ్, యష్ దయాల్ బాగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో హేజిల్‌వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, చివరి ఓవర్లలో దయాల్ కొన్ని కీలకమైన వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా కూడా మిడిలార్డర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+